చంద్రబాబే మహానాయకుడికి మైనస్..!

ఓ అన్నంత అంచనాలేమీ లేకుండా చాలా సింపుల్ గా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు. ఈ సినిమాను మొదటి [more]

Update: 2019-02-22 06:53 GMT

ఓ అన్నంత అంచనాలేమీ లేకుండా చాలా సింపుల్ గా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు. ఈ సినిమాను మొదటి భాగం కథానాయకుడు సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం, భార్య బాశావతారకం క్యాన్సర్ వ్యాధితో మరణించడం, అలాగే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ని నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు రాజకీయాలతో సీఎం గద్దె దించాడం, ఢిల్లీ రాజకీయాలలో ఎన్టీఆర్ కీలకంగా మారడం, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి ఎన్టీఆర్ ఎలా చొచ్చుకుపోయింది అనేది దర్శకుడు క్రిష్ బాగా చూపించాడు. ఇక ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన, హావభావాలు అన్ని బాగున్నాయి. అలాగే నాదెండ్ల క్యారెక్టర్ లో సచిన్ ఖేడ్కర్, చంద్రబాబు పాత్రలో రానా, బసవతారకం క్యారెక్టర్ లో విద్యాబాలన్ అదుర్స్ అన్న రేంజ్లో నటించి మేప్పించారు.

సేఫ్ గేమ్ ఆడిన బాలయ్య…

అయితే కథానాయకుడు సినిమా అందరూ బాగుందని కితాబిచ్చిన.. సినిమాలో ఎన్టీఆర్ భజన ఎక్కువైందని.. అలాగే ఎమోషనల్ గా ఎక్కడా టచింగ్ లేకపోవడంతోనే ఆ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యిందని అన్నారు. అందుకే మహానాయకుడులో ఆ లోపాలు లేకుండా క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే మహానాయకుడులో ప్రధానంగా ఓ లోపం బాగా హైలెట్ అవుతుంది. అదే చంద్రబాబు పాత్ర. నాదెండ్ల ఎపిసోడ్ తో, బసవతారకం మరణంతోనే మహానాయకుడుని ఎండ్ చెయ్యడం కూడా మహానాయకుడుకి ప్రధాన లోపమే. ఇక చంద్రబాబు మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడం, లక్ష్మీపార్వతి ఎంట్రీ లాంటి ఘట్టాలేమి మహానాయకుడులో లేకుండా బాలయ్య, క్రిష్ సేఫ్ గేమ్ ఆడారనిపిస్తుంది.

చంద్రబాబును హైలెట్ గా చూపిస్తూ….

ఇక మహానాయకుడులో ఎన్టీఆఱ్ రాజకీయాల్లోకి రావడమే తెలుగు దేశం పార్టీ పెట్టడం.. తొమ్మిది నెలలోనే అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ అప్పుడు హీరోగానే కనిపిస్తాడు. ఇక భార్య బసవతారకం కోసం విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ కి నమ్మకంగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయాలను తనకి అనుగుణంగా మార్చుకుని.. ఢిల్లీ పెద్దల అండదండలతో సీఎం కుర్చీకి ఎన్టీఆర్ ని దూరం చేసి తాను గద్దెనెక్కుతాడు. ఇక ఎన్టీఆర్ మళ్లీ పోరాడి సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటాడు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ సెంకండాఫ్ లో ఆ ట్విస్ట్ ని ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్ చేసిన సాహసాల కన్నా చంద్రబాబు చేసిన ప్రయత్నాలే హైలెట్ గా కనపడతాయి.

ఫైటింగ్ చేసిన బాబు పాత్ర

ఒకవైపు ఎన్టీఆర్ ఢిల్లీతో పోరాడుతుంటే పార్టీని కాపాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చంద్రబాబు వాళ్లను ఢిల్లీకి తీసుకువెళ్లడం.. అక్కడ నుండి బెంగళూరుకు తరలించడం లాంటి వ్యూహాత్మక నిర్ణయాలతో చంద్రబాబుని హీరోగా ఈ సినిమాలో చూపించారు. ట్రైన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఢిల్లీ తరలిస్తున్న సీన్‌లో విలన్‌‌లతో చంద్రబాబు ఫైటింగ్‌కి దిగిన సీన్‌ని బట్టి ఆయన పాత్రని మహానాయకుడులో ఏ రేంజ్‌లో హైలెట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు పాత్ర మహానాయకుడు సినిమాకి మళ్లీ మైనస్ లాగే కనబడుతుంది.

Tags:    

Similar News