జబర్దస్త్ అవినాష్ కి భారీ ఫైన్?

బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని వచ్చినా అందులో వైల్డ్ కార్డు ఎంట్రీలు కాస్త గ్రాండ్ గానే జరుగుతాయి. షో మీద క్రేజ్ పెంచడానికి కాస్త ఫేమ్ ఉన్న [more]

Update: 2020-09-11 05:31 GMT

బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని వచ్చినా అందులో వైల్డ్ కార్డు ఎంట్రీలు కాస్త గ్రాండ్ గానే జరుగుతాయి. షో మీద క్రేజ్ పెంచడానికి కాస్త ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ లని బిగ్ బాస్ హౌస్ లి కి పంపినట్టుగానే బిగ్ బాస్ సీజన్ 4 కూడా అదే జరుగుతుంది. నాగర్జున హోస్ట్ గా గత వారం మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 పెద్దగా రక్తి కట్టడం లేదు. షో లో ఏడుపులు, పెడబొబ్బలు తప్ప మరేమి జోష్ కనిపించడం లేదు. అంతా స్కిట్ ప్రకారమే జరుగుతుంది అనడానికి సాక్ష్యం షో లోని ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఒకరిని ఒకరు నమ్మకుండా బిగ్ బాస్ టాస్క్ ఏమో అంటూ అందరూ స్కిట్ ప్రకారమే నడుచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ షో పెద్దగా క్రేజ్ తెచ్చుకోవడం లేదని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం ఎప్పుడో వైల్డ్ కార్డు ఎంట్రీ ని పంపించాల్సింది కాస్త.. త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీకి జబర్దస్త్ అవినాష్ ని సెలెక్ట్ చేసి క్వారంటైన్ లో ఉంచింది. అయితే ప్రస్తుతం జబర్డ్స్ లో అవినాష్ టీం లీడర్ గా ఉన్నాడు.

టీం లీడర్ గా షో లో స్కిట్స్ చేసే అవినాష్ కున్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ అవినాష్ కి భారీగా ముట్టజెప్పి షోలోకి పంపుతుంది. అయితే మల్లెమాల తో కాంట్రాక్టు చేసుకున్న అవినాష్ జబర్దస్త్ నుండి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవగా. మల్లెమాల వాళ్ళు మాత్రం కాంట్రాక్టు ని క్రాస్ చేసినందుకు గాను జబర్దస్త్ అవినాష్ కి 10 లక్షల భారీ ఫైన్ వేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక మళ్ళీ స్కిట్స్ చెయ్యాలంటే ఇప్పడు 10 లక్షలు కట్టాల్సిందే అని మల్లెమాల యాజమాన్యం చెప్పడంతో అవినాష్ కూడా క్రేజ్ ఇంకా పెరగాలంటే ఈ పది లక్షలు కడదామని డిసైడ్ అయ్యి బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నట్టుగా టాక్. 

Tags:    

Similar News