పోలీసుల ముందుకు యాంకర్ రవి?

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ యాంకర్ రవి ఈమధ్యన కామ్ గానే ఉంటున్నాడు. లోకల్ గ్యాంగ్స్ లో స్టేజ్ మీద యాంకరింగ్ తో పాటుగా కామెడీ చేస్తున్న రవి [more]

Update: 2020-02-10 07:22 GMT

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ యాంకర్ రవి ఈమధ్యన కామ్ గానే ఉంటున్నాడు. లోకల్ గ్యాంగ్స్ లో స్టేజ్ మీద యాంకరింగ్ తో పాటుగా కామెడీ చేస్తున్న రవి మీద ఈమధ్యన కాంట్రవర్సీల న్యూస్ లు సోషల్ మీడియాలో తగ్గాయి. కొన్నిసార్లు కావాలని కెలుక్కునే రవి.. మరికొన్నిసార్లు మాత్రం మీడియాకి అడ్డంగా దొరుకుతుంటాడు. అయితే .. తన ఫ్రెండ్ ఒకరు తనకి డబ్బు విషయంలో మోసం చేసాడని చెప్పాడు.

తన నుండి 45 లక్షలు తీసుకుని.. ఇవ్వకుండా ఎగ్గొట్టాడని చెప్పాడు. అయితే తాజాగా యాంకర్ రవి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి సందీప్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు. సందీప్ తన దగ్గరనుండి ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో 45 లక్షలు అప్పు తీసుకున్నాడని, మధ్యలో కొంతడబ్బు వెనక్కి ఇచ్చాడు కానీ.. మిగతా మొత్తం అడుగుతుంటే…. ఇదిగో అదుగో అంటున్నాడని, ఈమధ్యన అయితే ఆ డబ్బు ఇవ్వకుండా కొంతమంది వ్యక్తుల చేత బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. తన దగ్గర మాత్రమే కాకుండా చాలామంది దగ్గర అప్పులు తీసుకున్న సందీప్ వారిని కూడా బెదిరిస్తున్నాడంటూ యాంకర్ రవి.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు.

Tags:    

Similar News