ఆది కోసం అనసూయ డిమాండ్!!

అనసూయ జంబర్దస్త్ యాంకర్ గాను.. కొన్ని జబర్దస్త్ స్కిట్స్ లో స్పెషల్ రోల్స్ చేస్తుంటుంది. జబర్దస్త్ లో అనసూయ గ్లామర్ షో, ఆమె క్రేజ్ వలన చాలా [more]

Update: 2020-06-16 06:02 GMT

అనసూయ జంబర్దస్త్ యాంకర్ గాను.. కొన్ని జబర్దస్త్ స్కిట్స్ లో స్పెషల్ రోల్స్ చేస్తుంటుంది. జబర్దస్త్ లో అనసూయ గ్లామర్ షో, ఆమె క్రేజ్ వలన చాలా స్కిట్స్ కూడా హిట్ అయ్యాయి. అందులోనూ హైపర్ ఆది స్కిట్స్ లో అనసూయ కేరెక్టర్ చేసింది అంటే అది పక్కా హిట్. హైపర్ ఆది తో అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద స్టెప్స్ వేస్తె..అబ్బో ఈలలు, కేకలు, అరుపులు. ఆది ఇచ్చే స్టెప్స్ కి అనసూయ అందంతో తిరిగే మెలికలు అన్ని ఆ స్కిట్ కె హైలెట్ అనేలా ఆది – అనసూయ జోడి పాపులర్ అయ్యింది. అందుకే అనసూయ – ఆది జోడి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఓ నిర్మాత వీళ్లిద్దరు మెయిన్ హైలెట్ గా ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేసాడట.

అయితే ఆ వెబ్ సీరీస్ లో అనసూయ కేరెక్టర్ హైలెట్ గురించి చెప్పి అనసూయ ని వెబ్ సీరీస్ కోసం ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. అనసూయ ఈ వెబ్ సీరీస్ లో నటించడానికి గాను భారీగా పారితోషకం డిమాండ్ చేసిందట. అంతేకాదు కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. ఇక అది కూడా తన కేరెక్టర్ తో పాటుగా ఆది కేరెక్టర్ కూడా బావుండాలని, అలాగే నాకిచ్చిన పారితోషకం తో సమానంగా ఆది పారితోషకం ఉండాలని..  డిమాండ్ చేసిందట. అయితే అనసూయ తన పని తాను చూసుకోక ఇలాంటి రికెమెండేషన్స్ అవసరమా అని ఆ నిర్మాత అనుకున్నప్పటికీ ఆమె క్రేజ్ ముందు తల వంచాడని అంటుంటే.. అనసూయ చేసిన ఈ పనికి హైపర్ ఆది హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ చెప్పినట్లు సమాచారం. 

Tags:    

Similar News