అనసూయ ప్లేస్ లో రష్మీనా? శ్రీముఖినా?

ఈటివి ఛానల్ జబర్దస్త్ షో అతలాకుతలం అయ్యింది. గత ఏడేళ్లుగా ఏ ఛానల్ కి రాని టీఆర్పీస్ తో ఈ జబర్దస్త్ షో దూసుకుపోయింది. జబర్దస్త్ షో [more]

Update: 2019-11-21 07:12 GMT

ఈటివి ఛానల్ జబర్దస్త్ షో అతలాకుతలం అయ్యింది. గత ఏడేళ్లుగా ఏ ఛానల్ కి రాని టీఆర్పీస్ తో ఈ జబర్దస్త్ షో దూసుకుపోయింది. జబర్దస్త్ షో కి షాకివ్వడానికి ఇతర ఛానల్స్ లో పెట్టిన షోస్ అన్ని మట్టిగొట్టుకుపోయాయి. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో అప్పుడు కూడా జబర్దస్త్ టీఆర్పీకి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అలంటి జబర్దస్త్ షో ఇప్పుడు రోజు మీడియాలో న్యూస్ అవుతుంది. జబర్దస్త్ షోనుండి జెడ్జెస్ నాగబాబు, రోజలు వెళ్ళిపోతే.. ఆ బాధ్యతలని అలీ టేకోవర్ చేసినట్లుగా ప్రచారం స్టార్ట్ అయ్యింది. నాగబాబు కి మల్లెమాల టీం కి విభేదాలతో నాగబాబు పక్క ఛానల్ కి పొతే.. జగనన్న చెప్పాడని రోజా జబర్దస్త్ ని వదులుకుంటుందట.

ఇక యాంకర్స్ లో రష్మీ జబర్దస్త్ ని వదలడం లేదు… కానీ అనసూయ మాత్రం పక్క ఛానల్ కి మారిపోవడంతో. ఇప్పుడు అనసూయ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారో అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. నాగబాబు… చమ్మక్ చంద్ర, అనసూయ వంటి వాళ్ళని తనతో పక్క ఛానల్ కి పోయి కామెడీ షో చేసుకుంటుంటే….. రష్మీ, సుడిగాలి సుదీర్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వీడడం లేదు. అయితే హాట్ యాంకర్ అనసూయ ప్లేస్ ని భర్తీ చెయ్యాలంటే అంత క్రేజున్న యాంకర్ అవసరం. అయితే ఎప్పటిలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ ని రష్మీ లీడ్ చేస్తే.. జబర్దస్త్ కి అనసూయ ప్లేస్ లో శ్రీముఖి ని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్. అసలు అనసూయ కన్నా ముందే జబర్దస్త్ ఛాన్స్ శ్రీముఖికి వస్తే.. ఆమె అప్పట్లో ఏదో కారణంతో వదులుకుని పొరబాటు చేస్తే. ఇప్పుడు వచ్చిన ఆ అవకాశాల్ని కళ్ళకద్దుకునేలా శ్రీముఖి ఉందంటున్నారు. అసలే బిగ్ బాస్ తో కాస్త క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖికి జబర్దస్త్ ఛాన్స్ వస్తే వదులుతుందా అంటున్నారు.

Tags:    

Similar News