త్రివిక్రమ్ మారేలా లేడే

ఎప్పుడు.. ఆచి తూచి, అసలు కంగారు లేకుండా సినిమాలు చేసే దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాని పరుగులు పెట్టించి మరీ షూటింగ్ చేసి సినిమాని విడుదల [more]

Update: 2019-08-28 05:27 GMT

ఎప్పుడు.. ఆచి తూచి, అసలు కంగారు లేకుండా సినిమాలు చేసే దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాని పరుగులు పెట్టించి మరీ షూటింగ్ చేసి సినిమాని విడుదల చేసాడు. ఎప్పుడూ ఆరామ్స్ గా సినిమాలు చేసే త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ తో సినిమాని పట్టాలెక్కించడం వల్లనే ఆ సినిమా అంత ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యిందనుకున్నారు. కానీ త్రివిక్రమ్ అరవింద సమేత సగం స్క్రిప్ట్ తోనే సెట్స్ మీదికెళ్లి… సగం స్క్రిప్ట్ ని సెట్స్ మీద రెడీ చేసాడట. తాజాగా అల్లు అర్జున్ తో చేస్తున్న అలా వైకుంఠపురములో సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకెళ్లాడట. అసలు స్క్రిప్ట్ లాక్ అవకుండానే సినిమాని మొదలెట్టాల్సి వచ్చిందట. కారణం అల్లు అర్జున్ కి సినిమాల విషయంలో ఏడాది గ్యాప్ రావడంతో.. ఇంకా ఇంకా స్క్రిప్ట్ మీదే కూర్చుంటే కష్టం కనక అలా వైకుంఠపురములో సినిమాని పట్టాలెక్కించాల్సి వచ్చిందట.

మరి సంక్రాతి రేసులో అలా వైకుంఠపురములో సినిమాని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడంతో.. త్రివిక్రమ్ ఇప్పుడు కంగారు పడడమే కాదు.. పంచ్, కామెడీ డైలాగ్స్ కోసం కొందరు కామెడీ రైటర్ల సాయం తీసుకుంటున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. ఇక ఎంత స్లోగా తీసిన సంక్రాంతికి చాలా టైం ఉండడంతో త్రివిక్రమ్ స్లోగానే అలా వైకుంఠపురములో షూటింగ్ చేస్తున్నాడట. ఇక అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సంగతి రెండు సినిమాల విషయంలో చూసాడు కాబట్టి… సినిమా మీద నమ్మకంతో గమ్మున ఉన్నపటికీ.. తన తదుపరి ప్రోజెక్టుల విషయంలో మాత్రం కాస్త కంగారు పడుతున్నట్లుగా వినికిడి. మరి త్రివిక్రమ్ తో సినిమా కమిట్ అయితే ఇలానే ఉంటుంది. గతంలో అజ్ఞాతవాసి సినిమా కసలు స్క్రిప్ట్ లేకుండానే… సినిమా మొదలెట్టి. సినిమా చేయడంతోనే ఆ అజ్ఞాతవాసి సినిమా ఘోరాతి ఘోరంగా ప్లాప్ అయ్యింది. మరి త్రివిక్రమ్ ఇప్పటికైనా కాస్త మారితే బావుంటుందని మెగా ఫాన్స్ అంటున్నారు.

Tags:    

Similar News