అఖిల్ పెళ్లి చేస్తున్న సమంత?

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఒకే ఒక్క సినిమా తోనే పెళ్లి పీటలెక్కేయ్యబోయి అందరికి షాకిచ్చాడు. శ్రీయ భూపాల్ తో ప్రేమాయణం నడపడమే కాదు.. నిశ్చితార్ధం అంటూ [more]

Update: 2020-09-20 06:01 GMT

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఒకే ఒక్క సినిమా తోనే పెళ్లి పీటలెక్కేయ్యబోయి అందరికి షాకిచ్చాడు. శ్రీయ భూపాల్ తో ప్రేమాయణం నడపడమే కాదు.. నిశ్చితార్ధం అంటూ హడావిడి చేసాడు. కానీ అఖిల్ కి శ్రీయ కి అభిప్రాయభేదాలవలన ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండా ఆగిపోయింది. ఇక అఖిల్ కూడా సినిమాల్తో బాగా బిజీ అయ్యాడు. మూడు సినిమాలు ప్లాప్ అవడంతో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అయినా హిట్ అవుతుందేమో అనే ఆశతో ఉన్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ లో పాల్గొంటున్న అఖిల్ పెళ్లి ముచ్చట మరోమారు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. అఖిల్ పెళ్లి చేయబోతుంది కూడా ఆయన వదిన గారు సమంతనే అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్ పెళ్లి జరగబోతోందని … ఈ పెళ్లిని సమంతనే ఇరు కుటుంభాలతో మాట్లాడి సెట్ చేసింది అనే న్యూస్ నడుస్తుంది. సమంత ఈ పెళ్లి సంబంధం అఖిల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని నాగ్ ఫ్యామిలీని పెళ్లి కూతురు ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడి.. అఖిల్ ని కూడా ఒప్పించినట్లుగా తెలుస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విడుదలయ్యేలోపే అఖిల్ పెళ్లి ముచ్చట అధికారికంగా బయటికి వస్తుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది.

Tags:    

Similar News