2018 ఫస్ట్ హాఫ్ రివ్యూ!!

Update: 2018-12-22 08:30 GMT

ఈ ఏడాది ప్రథమార్ధం లో విడుదలైన సినిమాల జాతకాలు ఫస్ట్ హాఫ్ రివ్యూలో చూసేద్దాం.

జనవరి:

జనవరిలో భారీ సినిమాలు, చిన్న సినిమాలు చాలానే విడుదలైనాయి. వాటిలో కొన్ని విజయాన్ని సాధించాయి. మరికొన్ని పరాజయం పాలయ్యాయి.సారధి , చిలుకూరి బాలాజ , అజ్ఞాతవాసి, జైసింహ, రంగులరాట్నం, ఇగో, ముక్తి, భాగమతి ఇలా దాదాపుగా 8 చిత్రాలు విడుదలయ్యాయి. సంక్రాంతి పండగ టార్గెట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ , అను ఇమ్మాన్యుల్ , కీర్తి సురేష్ తో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు... ఘన విజయ సాధిస్తుందని ఊహించిన ఈ సినిమా తీవ్ర నిరాశ పరిచింది. పవన్ కళ్యాణ్ కు గట్టి షాకిచ్చింది. బాలకృష్ణ ,నయనతార నటించిన జైసింహ సినిమా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మించాడు. యాక్షన్ తో నిర్మించిన ఈ చిత్రం ఓ మాదిరి హిట్ అయ్యింది . బాలకృష్ణ తనదైన మార్క్ చిత్రంగా పేరు తెచ్చుకుంది . అక్కినేని నాగార్జున నిర్మించిన రంగుల రాట్నం చిన్న సినిమా ను శ్రీరంజని దర్శకత్వం వహించగా రాజ్ తరుణ్, చిత్ర ఛుక్లా నటించారు. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి సినిమా విజయం సాధించింది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అయ్యిదననే చెప్పాలి.

ఫిబ్రవరి:

చలో, టచ్ చేసి చూడు, హౌరా బ్రిడ్జి, గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ, ఇది నా లవ్ స్టోరీ, అ, సోడా గోళీసోడా, రచయిత, మనసుకు నచ్చింది, జువ్వ, రా రా, చల్తే చల్తే, హైదరాబాద్ లవ్ స్టోర ,16 చిత్రాలు విడుదలయ్యాయి .నాగశౌర్య , రష్మిక జంటగా నటించిన చలో చిత్రం ఫర్వాలేదని చెప్పవచ్చు . వెంకట్ కుడుముల దర్శకత్వంలో ఉషా నిర్మించిన ఈ సినిమా నాగశౌర్య స్వంత సినిమా . రవితేజ, రాశిఖన్నా , సీరత్ కపూర్ తో నల్లమలుపు బుజ్జి వివేక్ సిరికొండ దర్శత్వంలో నిర్మించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది . మోహన్ బాబు ,విష్ణు , శ్రీయ తో మదన్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఊహించని ఫ్లాప్ . మోహన్ బాబును హీరోగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లేదని అర్ధమైంది. సాయి ధరమ్ తేజ , లావణ్య త్రిపాఠి తో వినాయక్ దర్శకత్వంలో సి .కళ్యాణ్ నిర్మించిన ఇంటెలిజెంట్ చిత్రం ఊహించని పరాజయం పొందింది . సాయి ధర్మ తేజకు పెద్ద షాక్ .వరుణ్ తేజ్, రాసి ఖన్నాతో వెంకట్ అట్లూరి దర్శత్వంలో బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన తొలిప్రేమ హిట్ అయ్యింది. నాని ప్రయోగాత్మకంగా నిర్మించిన 'అ' చిత్రం ఫర్వాలేదనిపించింది . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంతి ఈ సినిమా నిర్మించారు .

మార్చి:

ఏమంత్రం వేశావే , కిర్రాక్ పార్టీ , వదిన , నెల్లూరు పెద్దా రెడ్డి, నా రూటే సపరేటు, మనసైనోడు,నీది నాది ఒకే కథ, అనగనగా ఒక ఊళ్ళో, రాజ రథం, ఎమ్మెల్యే,మర్లపులి, రంగస్థలం 13 చిత్రాలు విడుదలైయ్యాయి . ఇందులో రామ్ చరణ్ , సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకుడు . ఈ సినిమా ఊహించని విజయాన్ని సాధించింది . ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ మారుమోగిపోయాయి. రామ్ చరణ్, సమంత, సుకుమార్ కి మంచిపేరు తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండ నటించిన ఏమంత్రం వేశావే సినిమా ఊహించని పరాజయం పాలయ్యింది .నందమూరి కళ్యాణ్ రామ్ , కాజల్ అగర్వాల్ నటించిన ఎమ్మెల్యే సినిమా ఘోరమైన ప్లాప్ అయ్యింది. ఇక మిగతా సినిమాలు ఈ మాత్రం ఆశాజనకంగా లేవు. కిర్రాక్ పార్టీ సినిమా యూత్ కి నచ్చుతుందని భావించారు కానీ వారి అంచనా నిజం కాలేదు .

ఏప్రిల్:

చల్ మోహన్ రంగ, సత్య గ్యాంగ్, ఇంతలో ఎన్నెన్ని వింతలో, కృష్ణార్జున యుద్ధం, అమీర్ పెట్ తో అమెరికా, భరత్ అనే నేను, ఆచారి అమెరికా యాత్ర, కణం వంటి సినిమాలు విడుదలయ్యాయి .నితిన్, మేఘా ఆకాశ్ నటించిన చల్ మోహనరంగ సినిమా నిరాశ పరిచింది. నాని, అనుపమ పరమేశ్వర్ నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఊహించని ఫ్లాప్. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఆచారి అమెరికా యాత్ర సినిమాకు నాగేశ్వర రెడ్డి దర్శకుడ . ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు.మహేష్ బాబు , కైరా అద్వానీ నటించిన భారత అనే నేను చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించాడు . డి .వి .వి దానయ్య నిర్మించిన ఈ సినిమా శివకు మహేష్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చింది . విడుదలైన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది.

మే:

నా పేరు సూర్య , మహానటి , మెహబూబా , అన్నదాతా సుఖీభవ , శీనుగాడు ప్రేమ , సహచరుడు , అమ్మమ్మగారిల్లు ,నెల టిక్కెట్ 8 చిత్రాలు విడుదలయ్యాయి. అల్లు అర్జున్, అను ఇమ్మాయిల్ తో వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీష్ నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశించారు. గతంలో ఎన్నో కథలు అందించిన వక్కంతం దర్శకుడుగా మాత్రం విజయం సాధించలేదు .పూరి జగన్నాథ తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మించిన మెహబూబా సినిమా పూరికి పెద్ద షాక్. పూరి అతి నమ్మకం దెబ్బతీసింది. రవితేజ , మాళవిక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాంప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ప్లాప్ ని మిగిల్చింది. హీరో రవితేజ కు మరో ఫ్లాప్ చిత్రం .ఇక ఈ నెలలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా మహానటి. కీర్తి సురేష్ ,సమంత, విజ దేవరకొండ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో శేషు ప్రియాంక నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు సృష్టించింది .

జూన్:

రాజుగాడు, ఆఫీసర్, బెస్ట్ లవర్స్, నా నువ్వే, దేశముదుర్స్, సమ్మోహనం, జంబలకిడి పంబ, నా లవ్ స్టోరీ, ఈ నగరానికి ఏమైంది? మిస్టర్ హోమానంద్, కన్నుల్లో నీరూపమే, ఐ పి సి సెక్షన్, సూపర్ స్కెచ్, సంజీవని,శంభో శంకర చిత్రాలు విడుదలయ్యాయి .నాగార్జున, మైరా సరీన్ జంటగా రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని పరాజయం పాలయ్యింది. అటు రాము , ఇటు నాగార్జునకి షాక్ . సుధీర్ బాబు, అతిధి రావు హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విజయం సాధించింది. ఇక మిగతా సినిమాలన్నీ ప్లాప్స్ లిస్ట్ లోకెళ్ళిపోయాయి.

Similar News