యూకేలో కౌన్సిలర్ గా తెలుగు వ్యక్తి ఉదయ్

విజయం అందుకున్న తర్వాత ఆరేటి ఉదయ్ చాలా కూల్ గా కనిపించాడు. UK మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్, ప్రధాన మంత్రి..

Update: 2022-05-13 12:14 GMT

లండన్‌లోని రాయల్ బోరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియాలోని హాలండ్ వార్డులో ఒక తెలుగు వ్యక్తి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆరేటి ఉదయ్‌కి నాలుగేళ్ల పదవీకాలం పాటు విధులను నిర్వర్తించనున్నారు. కౌన్సిలర్ గా అతడు ఎన్నికవ్వడం ఇది రెండోసారి. హైదరాబాద్‌లో చదివిన ఉదయ్ ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగాడు. ఇప్పుడు కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు.

విజయం అందుకున్న తర్వాత ఆరేటి ఉదయ్ చాలా కూల్ గా కనిపించాడు. UK మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్, ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోదరి రాచెల్ జాన్సన్‌తో కలిసి టెన్నిస్ ఆడుతూ గడపడం విశేషం. ఆరేటి ఉదయ్‌ విజయంపై అతడి ఫాలోవర్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆరేటి ఉదయ్‌ కు పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు.


Tags:    

Similar News