అనకొండ అటాక్: నీటిలో నుండి బయటకు వచ్చి ఒక్కసారిగా దాడి..!

జూన్ 30న సెంట్రల్ బ్రెజిలియన్ రాష్ట్రమైన గోయాస్‌లోని అరగుయా నది వెంబడి పడవలో పర్యాటకుల బృందాన్ని తీసుకుని వెళుతూ ఉండగా

Update: 2022-07-09 07:22 GMT

అనకొండ పాములు విషపూరితం కానివి.. వాటి ఎరను మింగేసి చంపుతాయి. అవి ఎక్కువ సమయం నీటిలో గడుపుతాయి. సాధారణంగా చిత్తడి నేలలు, ప్రవాహాలు, నదులలో ఉంటాయి. మనుషుల మీద దాడి చేయడం చాలా అరుదు. అయితే బ్రెజిల్‌లోని ఓ బోట్‌లో ఉన్న టూర్‌ గైడ్‌పై భారీ అనకొండ దాడి చేసింది. నీటిలోంచి బయటకు వచ్చి దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

జూన్ 30న సెంట్రల్ బ్రెజిలియన్ రాష్ట్రమైన గోయాస్‌లోని అరగుయా నది వెంబడి పడవలో పర్యాటకుల బృందాన్ని తీసుకుని వెళుతూ ఉండగా.. 38 ఏళ్ల జోవో సెవెరినో కెమెరాలో ఈ దాడిని బంధించాడు. బ్రెజిలియన్ ఫిషింగ్ గైడ్ పామును గుర్తించి ఇతర పర్యాటకులకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. నీటిలో నుండి ఒక్కసారిగా భారీ సర్పం బయటకు వచ్చి దాడి చేయడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది.
పాక్షికంగా నీట మునిగిన రెండు దుంగల దగ్గర నీటి కింద చుట్టబడిన నల్లమచ్చల పాముపై కెమెరా జూమ్ చేయగా.. అనకొండ నీటిలోంచి బయటకు వచ్చి టూర్ గైడ్‌ పై దాడి చేయడంతో.. అతను ఒక్కసారిగా షాక్‌తో కేకలు వేశాడు. అదృష్టవశాత్తూ అనకొండ కాటు గైడ్ ను పెద్దగా గాయపరచలేదు. అతడు అక్కడి నుండి వెంటనే పక్కకు వచ్చేశాడు. ఆకుపచ్చ అనకొండలు మానవులపై దాడి చేయవు. అవి భయపడినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి. ఆకుపచ్చ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. ఇది 30 అడుగుల పొడవు.. 10 అంగుళాల వెడల్పుతో 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది.

https://www.instagram.com/tv/CfeIYEIDICt/?utm_source=ig_web_copy_link


Similar News