అమెరికాలో మరోసారి కాల్పుల మోత

న్యూయార్క్‌లోని బఫెలో సూపర్‌ మార్కెట్‌లో పద్దెనిమిదేళ్ల ఓ శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో 10 మంది అమాయకులు అక్కడికక్కడే..

Update: 2022-05-16 13:29 GMT

అమెరికా రాష్ట్రం టెక్సాస్‌లోని అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌లోని ఫ్లీ మార్కెట్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా ఆదివారం కాల్పుల ఘటన జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. బాధితులందరూ 20 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నారని.. ఒకరికొకరు తెలిసివారే కావచ్చని అధికారులు తెలిపారు. కాల్పులు జరుగుతున్నప్పుడు ఆదివారం మధ్యాహ్నం ఫ్లీ మార్కెట్ చాలా బిజీగా ఉంది. హారిస్ కౌంటీ షెరీఫ్, ఎడ్ గొంజాలెజ్ మాట్లాడుతూ ఈ కాల్పులు జరిగినప్పుడు ఫ్లీ మార్కెట్ వద్ద వేలాది మంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మూడవ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలం నుంచి రెండు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

శనివారం దారుణం :
న్యూయార్క్‌లోని బఫెలో సూపర్‌ మార్కెట్‌లో పద్దెనిమిదేళ్ల ఓ శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో 10 మంది అమాయకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తుపాకీ కాల్పుల్లో మొత్తం 13 మంది బాధితుల్లో 11 మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిలిటరీ తరహా దుస్తులు, రక్షణ కవచం, హెల్మెట్‌ ధరించిన శ్వేతజాతీయుడు సూపర్‌మార్కెట్‌లో గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అమాయకులను కాల్చి చంపిన తరువాత ఉన్మాది తుపాకీని తన మెడలో వేసుకున్నాడు. అతి కష్టం మీద అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బఫెలో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు.


Tags:    

Similar News