వాహనదారులూ జాగ్రత్త.. నేటి నుంచే జరిమానాలు

హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ డ్రైవ్ చేపట్టనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు

Update: 2022-11-28 03:34 GMT

హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ డ్రైవ్ చేపట్టనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. నిబంధనలను మరింత కఠినతరం చేశారు. రాంగ్ రూట్ లో వస్తే 1,700 రూపాయలు జరిమానా నేటి నుంచి విధించనున్నారు. అదే ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200ల ఫైన్ వేయనున్నారు. నేటి నుంచి ఈ జరిమానాలు అమలవుతాయని పోలీసు శాఖ కొంతకాల క్రితమే వెల్లడించింది.

స్పెషల్ డ్రైవ్...
ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో రావడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తామని వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలను పక్కాగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. నేటి నుంచే ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు.


Tags:    

Similar News