సందీప్ రామ్ చరణ్ ఇంటికి ఒట్టి చేత్తో వెళ్ళలేదు....

Update: 2017-12-14 09:01 GMT

అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకులకి పూనకం తెప్పించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఎవ్వరూ టచ్ చెయ్యని సబ్జెక్ట్ తో అద్బుతమైన నారేషన్ తో మూడు గంటల పాటు ఈ రోజులలో కూడా థియేటర్ లో జనాలని కూర్చోబెట్టచ్చు అని నిరూపించాడు ఈ డైరెక్టర్. రీసెంట్ గా ఈ డైరెక్టర్ రామ్ చరణ్ తో కనిపించిన ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది . డైరెక్టర్ సందీప్ , హీరో శర్వానంద్ , యూవీ క్రియేషన్ హెడ్ విక్కీ ఇలా కొందరు నిన్న రామ్ చరణ్ ఇంటిని సందర్శించారు. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన పెట్టిన క్రిస్మస్ చెట్టు ని చూడడం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫోటోలు దిగి ఇంటర్నెట్ లో పెట్టగానే అవి కాసేపట్లో వైరల్ ఐపోయాయి.

రామ్ చ‌ర‌ణ్ కోసం సందీప్ స‌రికొత్త జోన‌ర్‌లో ఓ క‌థ సిద్ధం చేశాడు అనీ, చ‌ర‌ణ్‌కి లైన్ కూడా వినిపించాడు అనీ, ఈ సినిమాని చ‌ర‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే తెర‌కెక్కించాల‌ని భావిస్తున్న‌ట్టు న్యూస్ వస్తోంది . అందుకోసమే సందీప్ పనిగట్టుకుని రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడు అని అంటున్నారు చాలా మంది . అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ మెగా ఫాన్స్ మాత్రం సందీప్ తమ హీరోతో సినిమా చేసి తీరాలి అని కోరుకుంటున్నారు.చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీ, ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీను సినిమా ఉంటుంది, రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కూడా పూర్తి చేయాలి. ఆ తరవాత అయినా చేస్తే చరణ్ కి తమకీ సందీప్ పూనకం తెప్పించాలి అని కోరుకుంటున్నారు మెగా ఫాన్స్.

Similar News