రజినీకాంత్ కి అర్జంటు గా ప్రతివిమర్సకుడు కావలెను

Update: 2017-12-31 13:00 GMT

మొత్తం మీద ఎన్నో సంవత్సరాల నుంచీ అనుకుంటున్న ఊహాగానాలకి తెర పడినట్టు అయ్యింది. హీరో రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రం గురించి ఓపెన్ అయిపోయారు. త్వరలో పార్టీ పెడతా అనీ తమిళనాట అన్ని ప్రాంతాల నుంచీ తన వారు పోటీ చేస్తారు అంటూ డిక్లేర్ చేసారు రజినీకాంత్. తన అభిమాన కథానాయకుడి రాజకీయ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పడింది.

రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టంచేశారు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించారు బాగానే ఉంది. అయితే ఈ సందర్భంగా దేశ రాజకీయాలు బ్రస్టు పట్టిపోయాయి అంటూ బీజేపీ ని ఇన్ డైరెక్ట్ గా ఆడుకున్నారు రజినీకాంత్. కరప్షన్ , అన్యాయం పెరిగిపోయింది అంటూ బీజేపీ , కాంగ్రెస్ ల మీద పరోక్ష విమర్శలు చేసారు. స్వభావ సిద్దంగా కాస్త మెతక మనిషి ఐన రజినీకాంత్ కి సంబంధించి అంత ఘాటు ప్రతి విమర్శలు ఇవ్వడం జరిగే పని కాదు.

రజినీకాంత్ పొలిటికల్ పార్టీ ఇంకా పెట్టలేదు, కేవలం పెడతా అంటూ ప్రకటించిన రెండు గంటల్లో అనేక విమర్శలు ఆయన మీద మొదలయ్యాయి .. మరి అలాంటి వాటికి సమాధానం చెప్పే మనుషులని రజిని అర్జంటు గా సిద్దం చేసుకోవాలి లేదంటే ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ లాగా రెస్పాండ్ అవుతా అంటే అది సబబు కాదు

Similar News