ప్రభాస్ ఫాన్స్ కి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్

Update: 2017-12-09 16:56 GMT

బాహుబలి లాంటి ఖళాఖండం తరవాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. తాను ఎప్పుడో రన్ రాజ రన్ టైం లో ఇచ్చిన మాట మీద కట్టుబడిన ప్రభాస్ వెంటనే సుజీత్ కి ఛాన్స్ ఇచ్చి భారీ యాక్షన్ చిత్రం తో అంతా సిద్దం అయ్యాడు.

సాహో అనే పేరుతో రాబోతున్న ఈ సినిమా హిందీ , తెలుగు, తమిళం లలో రూపొందుతోంది. యాక్టర్ లు కూడా బాలీవుడ్ నుంచే రావడం విశేషం. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇందులో ప్రభాస్ పక్కన కనిపిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది, దాదాపు రెండు నెలల క్రితం హైదరాబాద్ లో షూటింగ్ మొదలు అవ్వగా ఇక్కడ షెడ్యూల్ పూర్తి అయిన తరవాత దుబాయ్ షెడ్యూల్ కోసం చాలా టైం తీసుకున్నారు మేకర్ లు. ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో సుజీత్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ని ఒక యాక్షన్ హీరోగా చూపించడం లో మనోడు సూపర్ సక్సెస్ అవుతున్నాడు అనేది టీజర్ చూస్తేనే చెప్పచ్చు.

అయితే వచ్చే ఏడాది దసరా కి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది, కానీ విడుదల విషయం లో ఇంకా గ్యాంరంటీ రావడం లేదు. ప్రతీ షెడ్యూల్ మధ్యనా గ్యాప్ వస్తూ ఉండడం , VFX వర్క్ లు భారీగా ఉండడం , షెడ్యూల్ కూడా స్లో గా సాగుతూ ఉండడం తో సాహో వచ్చే ఏడాది విడుదల డౌట్ అని చాలా మంది చెబుతున్నారు. ఇది ప్రభాస్ ఫాన్స్ కి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్.

Similar News