పవన్ కళ్యాణ్ కోసం చరణ్ చేసింది చిన్న త్యాగామేమీ కాదు.

Update: 2017-12-20 05:12 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం ద్వారా సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఈ క్రమంలో ముందుగా అజ్ఞాతవాసి సినిమా టీజర్ విడుదల చేశారు , ప్రస్తుతం అజ్ఞాతవాసి టీజర్ సోషల్ మీడియాలో,యూట్యూబ్లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ లైక్డ్ టీజర్ గా అవతరించింది.ఈ క్రమంలో మెగా అభిమానులు ఎంతో ఆనందించారు.. ఈ సందర్భంగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తానని తెలిపారు.

తాజాగా టీజర్ చూసిన అనంతరం రామ్ చరణ్ తన స్పందనని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. బాబాయ్ అద్భుతంగా నటించారు. ఆయన హావభావాలన్నీ నచ్చాయి అని చెప్పిన చరణ్ . చిత్ర విడుదల కోసం సంక్రాంతి వరకు ఆగలేను అంటున్నాడు. ఇదంతా ఫేస్ బుక్ లో టీజర్ గురించి పోస్ట్ చేశాడు చెర్రీ .. అయితే చరణ్ ఎప్పటికీ బయట పెట్టని విషయం ఏంటంటే , తన బాబాయ్ కోసమే రంగస్థలం ని చరణ్ పోస్ట్ పోన్ చేసాడు అని చెప్పాలి.

బాబాయ్ సినిమా రాబోతోంది అని ముందుగా తెలుసుకున్న చరణ్, బాలయ్య - బాబాయ్ - తన రంగస్థలం ఇలా మూడిటి మధ్యనా క్లాష్ రాకుండా సంక్రాంతి నుంచి మార్చ్ కి అంటే పెద్దగా కలక్షన్ లు రాని సీజన్ కి వెళ్ళిపోయాడు. ఈ విషయం మెగా ఫాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు తప్ప ఒక్కరూ బయట పెట్టడం లేదు. చరణ్ త్యాగం చిన్నదేమీ కాదు. సంక్రాంతి టైం లో సినిమాలు తేడా వస్తే కాస్తో కోస్తో ఆడతాయి కానీ మార్చ్ ఎండ్ లో అంటే అది అసలు చాలా ఇబ్బందికరమైన సమయం.

Similar News