తెలుగు మీడియా ఆయన్ని ఎందుకు ఇగ్నోర్ చేసింది ?

Update: 2017-12-16 10:19 GMT

ప్రపంచంలో అందరూ తమ బొమ్మను పేపర్ల లోనో, టీవీ లోనో చుసుకోవాలని ఉంటుంది. కానీ ఆయన తన బొమ్మను కాదు, తాను వేసిన వేలాది బొమ్మలను అలా అవలీలగా జాతికి అంకితం ఇచ్చేశాడు, అవి అయన గర్వపడేలా కాక ఇవాళ మనం గర్వించేలా తెలుగు సంస్కృతి కి ప్రతిబింబాలు అయ్యాయి . ఇక అయన గురుంచి ఎందరెందరో ఎనెన్నో రాతలు రాసిన, అయన తనదైన శైలి లో వయారం వల్లికెల అక్షరాలు రాసేటపుడు వచ్చే శోభే వేరు. అయన మరెవరో కాదు బాపు గారు.

బాపు బొమ్మ రాత తెలుగు జాతి నుదుటన బ్రహ్మ రాసిన బ్రహ్మాండమైన రాత అని అంటూ ఉంటారు .ఇందులో సందేహం అక్కర్లేదు.ఇంతటి మహనీయుడు ఈ లోకం విడిచి స్వర్గస్తులయ్యారు. తాజాగా నిన్న ఆయన జయంతి జరిగింది . అయినా తెలుగు మీడియా పూర్తిగా మ‌రిచింది. మెజారిటీ పార్ట్ మీడియా అస‌లు ఈ దిగ్గ‌జాన్ని గుర్తు పెట్టుకున్న‌దే లేదు. అలాంటి ఒక లెజెండ్రీ పర్సనాలిటీ ని తొంభై శాతం మంది గుర్తు చేసుకోకపోవడం సిగ్గుచేటు , పత్రికరంగంలో, మీడియా రంగంలో కొందరు మాత్రమే బాపు గారికి ప్రాధాన్యత ఇచ్చారు. బాపూ దర్శకత్వం వహించిన చివరి చిత్రమైన శ్రీరామరాజ్యం తెలుగు ప్రేక్షకులను ఎంతో కనువిందు చేసింది .

ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ , ఎమోషన్, విమర్శకులకి ఆశ్చర్యం కలిగించింది. శ్రీరామరాజ్యం చిత్రాన్ని తీస్తున్నప్పుడు బాపు గారి వయసు 60 కి పైబడే, కానీ అంత వయసులో కూడా శ్రీరామరాజ్యం చక్కగా తెరమీద గీశారు. ఇప్పటివరకు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. నేడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ బాపు గారి శిష్యుడు .. త్రివిక్ర‌మ్‌లో క్రియేటివిటీ, హాస్య‌చ‌తుర‌త‌ను ఎక్కించిందే బాపు

Similar News