జాతకం ప్రకారమే నాగార్జున ని ఎదిరిస్తున్న దిల్ రాజు ?

Update: 2017-12-09 08:13 GMT

దిల్ రాజు ప్రస్తుతం డైరెక్ట్ గా హీరో/ప్రొడ్యూసర్ నాగార్జున తో పేచీ పెట్టుకుంటున్నారు అంటూ ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో అఖిల్ తో డిజాస్టర్ కొట్టి డెబ్యూ బ్యాడ్ గా చేసిన నాగార్జున, తన కొడుకు రెండో చిత్రం హలో తో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి అనీ దానికోసం గ్రౌండ్ క్లియర్ గా ఉండాలి అనీ కోరుకుంటున్నారు.

కానీ అదే టైం లో దిల్ రాజు MCA - మిడిల్ క్లాస్ అబ్బాయి ని విడుదల చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీనిమీద ఎన్ని డిస్కషన్ లు జరిగినా హలో కి పోటీ గా MCA వచ్చేస్తోంది . అయితే దిల్ రాజు ఈ ఏడాది లో ఇప్పటికే ఐదు సినిమాలు విడుదల చేసి ఐదూ హిట్ లు కొట్టేసారు. కానీ ఆరవ సినిమా విషయం లో కూడా విపరీతంగా మొండికేస్తున్నారు. దిల్ రాజు ప్రవర్తన వెనకాల ఏదో సీక్రెట్ ఉంది అనే మాటలు వినపడుతున్నాయి.

దిల్ రాజు ప్రస్తుతం తను గట్టిగా నమ్మే సిద్ధాంతి మాటలని విశ్వసిస్తున్నారు .. ఆయన చెప్పిన దాని ప్రకారం దిల్ రాజు సొంత బ్యానర్ లోంచి 'ఆరు' - 6 సినిమాలు 2017 లో విడుదల అయితే ఆయన జాతకం ప్రకారం ఫ్యూచర్ లో దిల్ రాజు దశ ఒక రేంజ్ లో తిరుగుతుంది అని చెప్పారట. దాన్నే పట్టుకున్న దిల్ రాజు ఇలా నాగార్జునకి సైతం ఎదురు వెళ్ళడానికి వెనకాడడం లేదు.

Similar News