జబరస్త్ షో చెయ్యకు

Update: 2017-12-22 11:36 GMT

వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే రోజా vs పవన్ ఫ్రెండ్ , సినిమా నిర్మాత బండ్ల గణేష్ ఎపిసోడ్ ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలిసిందే . ఇప్పుడు ఈ ఎపిసోడ్ నెమ్మదిగా నాగబాబు పీకల మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఎపిసోడ్ గురుంచి మెగా అభిమానులలో చర్చలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి.

నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకి వచ్చేయాలి అని .. మెగా అబిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏక వచనం పేరిట విమర్శించడం తో పవన్ అభిమాన భక్తుడు అయిన నిర్మాత బండ్ల గణేష్ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు . ఈ క్రమంలో రోజా కూడా నిర్మాత బండ్ల గణేష్ పై "తీవ్రమైన పదజాలంతో ధూషించింది.ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు నాగబాబు కార్నర్ అయ్యారు. ఎందుకంటే నాగబాబు రోజా కలిసి జబర్దస్త్ కు జడ్జిలు గా పనిచేస్తున్నారు.. ఈ క్రమంలో తన తమ్ముడి ని తిట్టిన రోజా తో కలిసి నాగబాబు నవ్వగలరా అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆ షో లో కొనసాగేకంటె వైదొలగడమే మేలని మెగా అభిమానులు నాగ బాబు ని అభ్యర్థిస్తున్నారు

Similar News