ఏ మగాడూ చెయ్యలేనిది విరాట్ చేసాడు

Update: 2017-12-13 09:24 GMT

ప్రస్తుతం మీడియా లో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ ల గురించే డిస్కషన్ లు సాగుతున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం ఎవ్వరికీ చెప్పకుండా ప్లాన్ చేసి పెళ్లి చేసుకోవడం అది కూడా ఇండియా లో కాకుండా గ్రాండ్ గా ఇటలీ లో చేసుకోవడం అతిపెద్ద సెన్సేషన్ అయ్యి కూర్చుంది.

అయితే ఇండియన్ క్రికెట్ టీం విరాట్ కోహ్లీ స్వస్థలం డిల్లీ, డిల్లీ నుంచే క్రికెటర్ గా ఎదిగిన విరాట్ కి ఆ ఊరితో చాలా అనుబంధం ఉంది. అనుష్క ది పంజాబ్ అయినా ముంబై లో సెటిల్ అయ్యింది కుటుంబం. ఇప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి తరవాత ఇద్దరూ కలిసి డిల్లీ లో అత్తవారి ఇంట్లోనో లేక విడి గానో ఉండాలి .. అలా ఉంటే గనక అనుష్క కెరీర్ కి చాలా తలనొప్పులు వస్తాయి.

బాలీవుడ్ మొత్తం ముంబై లో నే ఉంటుంది. సినిమా షూటింగ్ లూ సినిమా ఆఫీస్ లూ ప్రొడ్యూసర్ ల ఇళ్ళు. ఇలా ఒకటేమిటి అనేక పనులకి ముంబై మహానగరం పెద్ద స్థలం సో ఇప్పుడు ఈ విషయం అంతా అర్ధం చేసుకున్న విరాట్ కోహ్లీ అనుష్క కోసం డిల్లీ వదిలి ముంబై రావడానికి సిద్ద పడ్డాడు. విరాట్ - అనుష్క ముంబై లో ఇప్పుడొక స్పెషల్ ఫ్లాట్ ని అది కూడా సముద్రం ఫేసింగ్ ఫ్లాట్ ని కొనుగోలు చేసారు. పెళ్లి తరవాత అనుష్క వెళ్ళాల్సింది బదులుగా తానే వచ్చి ట్రెండ్ సెట్ చెయ్యబోతున్నాడు విరాట్ కోహ్లీ . ఈ విషయం లో విరాట్ ని మెచ్చుకోకుండా ఉండలేం మరి ..

Similar News