ఏ నిమిషం లో అయినా అరస్ట్..?

Update: 2017-12-09 08:36 GMT

పవన్ కళ్యాణ్ మీద ఆయన పార్టీ జనసేన మీదా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రచ్చకి ఎక్కిన ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి ఇప్పుడు అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నారు.

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని తిట్టే నెపం తో " నర హంతకుడు మోడీ తో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ అప్పట్లో బీజేపీ కి సపోర్ట్ ఇచ్చి ఏపీ ప్రజల కొంప ముంచాడు . దానికి ఆయన భేషరతు గా క్షమాపణ చెప్పాలి " అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ ఏం చేసాడు అనేది పక్కన పెడితే ఒక దేశ ప్రధానమంత్రి ని డైరెక్ట్ గా నర హంతకుడు మోడీ అంటూ మాట్లాడిన కత్తి మహేష్ మీద వెంటనే నెగెటివ్ మాటలు వినపడ్డాయి.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ పోలీస్ సహాయం తో మహేష్ కత్తి మీద FIR నమోదు కూడా చేసారు. ఈ క్రమం లో మహేష్ తన ట్వీట్ ని వెంటనే డిలీట్ చేసాడు. అంతటితో ఆగని సింగ్ మహేష్ కత్తి ని అరస్ట్ చేయించడానికి తన అధికారం మొత్తం వాడుతున్నారు అని సమాచరం. అనీ టైం మహేష్ కత్తి చేతికి సంకెళ్ళు పడచ్చు అంటున్నారు.

Similar News