అనుష్క ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు !

Update: 2017-12-09 07:00 GMT

రుద్రమ దేవి గా మహారాణి పాత్ర లో కనిపించాలి అన్నా , తల్లిగా దేవసేన పాత్రలో రివెంజ్ తీర్చుకోవాలి అన్నా , యువరాణి గా అదే దేవసేన పాత్ర లో ప్రభాస్ తో రోమాన్స్ చెయ్యాలి అన్నా ఒక్క అనుష్క కే చెల్లింది. అద్భుతమైన నటి గా ఇండియా యావత్తూ బాహుబలి తరవాత అనుష్క ని ఆకాశానికి ఎత్తేస్తోంది. అయితే అనుకోకుండా బుద్ధి తక్కువ అయ్యి చేసిన ' సైజు జీరో' సినిమా అనుష్క కి కష్టాలు తీసుకుని వస్తోంది. సైజు తగ్గలేక నానా తంటాలు పడుతున్న అనుష్క సడన్ గా ఇప్పుడు దాదాపు మునుపటి సైజు కి వచ్చేసి సన్నగా నాజూకు గా కనిపిస్తోంది.

ఈ మధ్య ఎలాంటి ఆడియో ఫంక్షన్ లకి, ఇతరత్రా ప్రోగ్రాం లకి రాని అనుష్క కి సంబందించిన ఒక ఫోటో ఆ మధ్య ట్విట్టర్ లో దర్సనం ఇచ్చింది. అందులో ఆమె చాలా నాజూకుగానే కనపడ్డం విశేషం. అయితే అనుష్క ఒక డిఫరెంట్ ప్రక్రియ లో తన ఒళ్ళు మొత్తం తగ్గించుకుంది అనీ, అది ఆపరేషన్ కూడా కాదు అనీ అంటున్నారు.

మనకి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఆమె ఈ ప్రాసెస్ లో విపరీతమైన వెన్ను నొప్పి ని కొని తెచ్చుకుందట. ఎప్పుడూ ఆమె కి లేని ఈ నొప్పి కేవలం కొన్ని నెలలుగా ఆమెని ఇబ్బంది పెడుతోంది. ఎంతకీ తగ్గకపోవడం తో కేరళ తో పాటు కోయంబత్తూర్ లాంటి ప్రాంతాలలో ఆమె ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటోంది అనీ, అది కూడా ఎవరికీ తెలీకుండా ఈ ట్రీట్మెంట్ సాగుతోంది అని సమాచారం.

Similar News