జగన్ రెడ్డి పాత్రలో అర్జున్ రెడ్డి..?

Update: 2018-09-14 08:31 GMT

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైఎస్ఆర్ పాత్రలో మళయాళ అగ్రనటుడు మమ్ముట్టి నటిస్తున్నఈ చిత్రాన్ని వై.ఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండుటెండలో చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన కుమారుడు వై.ఎస్.జగన్ పాత్ర కూడా ఉండనుంది. అయితే, ఈ పాత్రను తమిళ నటులు సూర్య లేదా కార్తి చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, జగన్ పాత్రను యువ హీరో విజయ్ దేవరకొండ పోషించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం నోటా, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు కూడా రాజకీయ కథల సినిమాలే. మరి యాత్రలో జగన్ రెడ్డి పాత్రలో అర్జున్ రెడ్డి నటిస్తాడా..? లేదా..? తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Similar News