ప్రముఖనటుడు త్వరలోనే టిడిపిలోకి?

టాలీవుడ్ లో ప్రముఖ కవి, శివ భక్తుడు, విలక్షణ నటుడు అయిన తనికెళ్ళ భరణి.. ప్రస్తుతం సినిమాల్తో బాగా బిజీగా వున్నాడు. అయితే తనికెళ్ళ భరణి కొద్ది [more]

Update: 2020-02-06 06:42 GMT

టాలీవుడ్ లో ప్రముఖ కవి, శివ భక్తుడు, విలక్షణ నటుడు అయిన తనికెళ్ళ భరణి.. ప్రస్తుతం సినిమాల్తో బాగా బిజీగా వున్నాడు. అయితే తనికెళ్ళ భరణి కొద్ది కాలంగా ఒక రాజకీయ పార్టీలోకి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఏపీ లో అల్లకల్లోలంగా ఉన్న టిడిపి పార్టీలోకి తనికెళ్ళ భరణి వెళ్ళబోతున్నట్లుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తనికెళ్ళ భరణి ఎప్పటి నుండో టిడిపి పార్టీలో చేరాలని యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టిడిపి పార్టీ పరిస్థితి ఏపీలో అగమ్య గోచరంగా ఉంది. రాజధాని విషయంలోనే కాదు.. ప్రస్తుతం పార్టీ నుండి ఎమ్యెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి వైసిపి తదితర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో టిడిపి పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదని తనికెళ్ళ భరణిని సినిమాపరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు ఆపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పార్టీ పరిస్థితి బావుండలేదు, అలాగే అసలు టిడిపి పార్టీ చివరికి ఏమవుతుందో అని.. ఆలాంటి టైం లో మీరు టిడిపి పార్టీలోకి వెళ్లడం సబబు కాదు అని కే రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు తనికెళ్ళ భరణి ని ఆపుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, తండ్రిగా ఇలా రకరాల పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు పొందిన తనికెళ్ళ భరణికి.. కవిగా కూడా మంచి పేరుంది. ప్రస్తుతం సినిమాల్తో బిజీ అయిన.. తనికెళ్ళ భరణికి రాజకీయాల మీదున్న ఆసక్తి ఎక్కడికి చేరుస్తుందో చూడాలి.

Tags:    

Similar News