విజయ్ చెబితే వినాల్సిందే…!

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ లో చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. [more]

Update: 2019-02-14 06:01 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ లో చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే హీరోగా సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు క్యూలో ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కథని నమ్మి సినిమాలు చేస్తున్నాడు. అందుకే విజయ్ కి త్వరగా విజయాలు వరిస్తున్నాయి అంటారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ తాజాగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.

రీషూట్ చేయమన్న విజయ్…

షూటింగ్ ఏకదాటిగా జరుపుకుంటున్న డియర్ కామ్రేడ్… చిత్రకరణ చివరి దశకు చేరుకుంది. కాకినాడలోని ఓ కాలేజ్ లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల మీద సినిమాలోని మేజర్ సన్నివేశాలను ఎక్కువగా చిత్రీకరణ జరిపారట. అయితే కాకినాడ షూటింగ్ పూర్తికాగానే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అవుట్ పుట్ చూసి నిరాశకు లోనయ్యాడట. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ తగ్గిందని అందుకే కొన్ని సీన్స్ ని రీ షూట్స్ చెయ్యమని దర్శకనిర్మాతలకు చెప్పాడట విజయ్. సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉంటేనే.. ప్రేక్షకులు త్వరగా కథకు కనెక్ట్ అవుతారని విజయ్ చెప్పినదానికి దర్శకనిర్మాతలు మారు మాట్లాడకుండా రీషూట్ చేయడానికి రెడీ అయ్యారట. మరి సూపర్ హిట్ హీరో ఏదైనా చెబితే చెయ్యకుండా ఉంటారా. తన హిట్స్ పరంపర మెయింటైన్ చెయ్యడానికి విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరి ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొవడంలో తప్పులేదులే.

Tags:    

Similar News