వెంకీమామ షాకింగ్ శాటిలైట్ రైట్స్..!

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీమామ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి హీరోస్ కి [more]

Update: 2019-05-16 08:35 GMT

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీమామ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి హీరోస్ కి చెరొక హిట్ ఉండడంతో ఈ సినిమా రైట్స్ ఎక్కువ చెబుతున్నారు సురేష్ బాబు. ఆయ‌న‌ చిన్న సినిమాలనే భారీ ధరలకు అమ్మడం ప్రత్యేకత. అటువంటిది హిట్ హీరోస్ సినిమా అంటే ఏ రేంజ్ లో అమ్ముతాడో వేరే చెప్పనవసరం లేదు. ఎఫ్-2తో వెంకీ, మజిలీతో చైతు హిట్ కొట్టారు. వీరిద్దరికి సక్సెస్ లు ఉన్నాయి కాబట్టి వెంకీమామ సినిమాకు భారీ రేట్లు చెబుతున్నాడట.

ఏకంగా 13 కోట్లు చుబుతున్నార‌ట

ఈ మూవీకి సురేష్ ఒక్కడే నిర్మాత కాదు.టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నాడు. కాకపోతే బిజినెస్ డీలింగ్స్ అన్నీ సురేష్ బాబే చూసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం 2 – 3 ఛానెళ్లు ప్రయత్నించాయి. అయితే సురేష్ బాబు చెప్పిన అమౌంట్ కి షాక్ అయ్యి వెన‌క్కి వెళ్లిపోయారు. సురేష్ ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఏకంగా 13 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట సురేష్ బాబు. అదేంటి అని అడిగితే మజిలీ, ఎఫ్2 సినిమా పేర్లు చెబుతున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.

Tags:    

Similar News