తారక్ ను డైరెక్ట్ చేయనున్న టాప్ రైటర్..!

రాజమౌళితో సినిమా అంటే విషయం మాములుగా ఉండదు. కనీసం రెండేళ్లు టైం పడుతుంది ఆ హీరో బయటికి రావడానికి. బయటకు వచ్చాకనే తమ నెక్స్ట్ మూవీ ఏంటి [more]

Update: 2019-04-19 11:33 GMT

రాజమౌళితో సినిమా అంటే విషయం మాములుగా ఉండదు. కనీసం రెండేళ్లు టైం పడుతుంది ఆ హీరో బయటికి రావడానికి. బయటకు వచ్చాకనే తమ నెక్స్ట్ మూవీ ఏంటి అని ఆలోచిస్తారు. కానీ ఎన్టీఆర్ అలా చేయడం లేదు. ప్రస్తుతం తారక్ జక్కన్న డైరెక్షన్ లో #RRR అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తారక్ తన నెక్స్ట్ మూవీస్ ఎవరితో చేయాలి అనే దానిపైన ఆల్రెడీ క్లారిటీగా ఉన్నాడట. తారక్ తన కెరీర్లో చెయ్యబోయే 30వ సినిమాకి డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్నకు త్రివిక్రమ్, సుకుమార్, అట్లీ క‌నిపించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొకరు వచ్చారు.

ఈసారి కొత్త డైరెక్ట‌ర్ తో…

కానీ ఆయన డైరెక్టర్ కాదు. ఇప్పుటివరకు ఒక్క సినిమా కూడా ఆయన డైరెక్ట్ చేయలేదు. కాకపోతే పేరుమోసిన రైటర్. ఎన్టీయార్ బయోపిక్, గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె లాంటి ప్రస్టీజియస్ మూవీస్‌కి స్క్రిప్ట్ ఇచ్చిన సాయిమాధవ్ బుర్రా.. తారక్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. రీసెంట్ గా ఆయన తారక్ ను కలిసి ‘ఒక మంచి లైన్ ఉంది చెప్పమంటారా’ అంటూ టచ్ చేసిన బుర్రా.. సదరు స్టోరీ లైన్‌తో జూనియర్‌ని పడేశాడట. ‘స్టోరీ ని డెవలప్ చెయ్యి. నువ్వే డైరెక్ట్ చెయ్యి..’ అంటూ వెంటనే తారక్ బంపరాఫర్ ఇచ్చాడట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వారికే తెలియాలి. అయితే తారక్ వెంటనే చేస్తాడా? లేదా గ్యాప్ తీసుకుని చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News