సైరా నిర్మాతల డిమాండ్ మామూలుగా లేదు..!

సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు చూసే రోజులు ఇవి. కొన్నిసార్లు సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టామని [more]

Update: 2019-03-06 07:24 GMT

సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు చూసే రోజులు ఇవి. కొన్నిసార్లు సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టామని డిస్ట్రిబ్యూటర్స్ పై ఆ భారం వేస్తే ఎలా..? ఇప్పుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా చిత్రం పరిస్థితి అంతే ఉంది. ఈ సినిమాకు రెండు వందల కోట్ల పైచిలుకు బడ్జెట్‌ అయిందని టాక్ ఉంది. అందుకే రామ్ చరణ్ భారీ రేట్‌ కోట్‌ చేస్తున్నాడట. అమెరికా రైట్స్ నాలుగు మిలియన్‌ డాలర్లు అయితే ఇస్తామని చెబుతున్నారంట మేకర్స్. నాలుగు మిలియన్‌ డాలర్స్ షేర్ రావాలంటే కనీసం ఎనిమిది మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూళ్లు రావాలి.

బాహుబలి రేంజ్ లో వసూళ్లు ఉంటాయా..?

మరి ఇప్పుడున్న పరిస్థితిల్లో అది కష్టం. బాహుబలి చిత్రానికి తప్ప మరే చిత్రానికి అంత వసూళ్లు రాలేదు. ఇక చిరు నటించిన ఖైదీ నంబర్‌ 150కి రెండున్నర మిలియన్ల కంటే తక్కువ గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. బాహుబలి చిత్రానికి వచ్చిన టాక్ సైరాకి కూడా వస్తే అంతా వసూలు సాధ్యమవుతుంది. ఎనిమిది మిలియన్‌ డాలర్లు అనేది చాలా పెద్ద టార్గెట్‌. మరి జనాలు ఎంతవరకు ఈ సినిమా ఆదరిస్తారో చూడాలి. అసలు ఈ సినిమాను అంతా రేట్ పెట్టి అక్కడ కొంటారా లేదా చూడాలి.

Tags:    

Similar News