సుక్కు తో మహేష్ కి కట్ అయిందా..?

‘1 నేనొక్కడినే’ లాంటి కల్ట్‌ సినిమా ఇచ్చిన సుకుమార్ అంటే మహేష్ కు ఇష్టం. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తనకు గుర్తుండిపోయే మూవీ ఇచ్చాడని మహేష్ [more]

Update: 2019-03-07 07:07 GMT

‘1 నేనొక్కడినే’ లాంటి కల్ట్‌ సినిమా ఇచ్చిన సుకుమార్ అంటే మహేష్ కు ఇష్టం. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తనకు గుర్తుండిపోయే మూవీ ఇచ్చాడని మహేష్ కి గౌరవం. ఇక సుకుమార్.. రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా మహేష్ కి నచ్చడంతో ఏమైనా కథ ఉంటె చెప్పు చేద్దాం అని అన్నాడంట. దాదాపు 10 నెలలు పైనే కావొస్తుంది కానీ ఇంతవరకు సుకుమార్ మహేష్ ని మెప్పించే లైన్‌ ఒక్కటి కూడా చెప్పలేకపోయాడు. అయితే కంగారు ఏమీ లేదు ఈలోపాల నేను అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తా, అది ఆగస్టు వరకు కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు నుండి నీకు డేట్స్ ఇస్తా అని చెప్పాడట.

సుకుమార్ తో సినిమా ఉండదా..?

సుకుమార్ కి ఇది నచ్చలేదు మధ్యలో అనిల్ రావిపూడి సినిమా ఎందుకు.. మన సినిమా చేద్దాంగా అని చెప్పాడట. ఈ లోపల అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్ తీస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇది మహేష్‌కి అసలు నచ్చలేదు. తన సినిమా ఇంకా స్టార్ట్ చేయకుండా అల్లు అర్జున్ తో సినిమా ఎలా చేస్తాడని ఫైర్‌ అయ్యాడట. అందుకే మహేష్ సాయంత్రానికే ట్వీట్‌ చేసేసరికి సుకుమార్‌ మళ్లీ మహేష్‌ని కాంటాక్ట్‌ చేయడానికి ట్రై చేస్తే ఆయన ఖాళీగా లేరనే జవాబు వచ్చిందట. కాబట్టి ఫ్యూచర్ లో కూడా మహేష్ సుక్కుతో సినిమా చేసే అవకాశాలు లేవు అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Tags:    

Similar News