సైరా వాయిదా పడనుందా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2 న ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది. తెలుగు తో పాటు ఈమూవీ తమిళం, కన్నడ, హిందీ భాషల్లో [more]

Update: 2019-08-29 11:33 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2 న ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది. తెలుగు తో పాటు ఈమూవీ తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వనుంది. అయితే బాలీవుడ్ మీడియా లో ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ గురించి రూమర్స్ వస్తున్నాయి. సైరా చిత్రం అక్టోబర్ 8 లేదా 9న విడుదలయ్యే అవకాశం వుందన్నది ఆ గ్యాసిప్.

వార్ రిలీజ్ అవుతుండటంతో…

ఇప్పటికే దీనిపై ట్వీట్స్ కూడా వచ్చాయి. దీనికి కారణం అదే రోజు అంటే అక్టోబర్ 2 న బాలీవుడ్ లో ‘వార్’ అనే సినిమా రిలీజ్ అవుతుంది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ ల కాంబినేషన్ లో వస్తున్నా ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ అండ్ ట్రైలర్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి. ఈసినిమాకి పోటీగా వెళ్తే సైరాకు నష్టం తప్పదు.

వారం తర్వాతే….

అసలే సైరా పాన్ ఇండియా సినిమా. ఏ మాత్రం తేడా కొట్టిన అసలుకే మోసం వస్తుంది. అందుకే సైరా ను వారం తరువాత రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. మరి బాలీవుడ్ లో వరం వెనక్కి వెళ్తే అన్ని భాషల్లో వెళ్తుందా? ఏమో చూడాలి. అసలు ఇందులో ఎంత నిజముందో చూడాలి.

Tags:    

Similar News