సూపర్ స్టార్ అయితే నాకేంటి..!

ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ సినిమాలో వరుణ్ తేజ్ మీద డామినేషన్ చూపించింది. ఆ సినిమాలో భానుమతిగా రెచ్చిపోయి నటించింది. [more]

Update: 2019-03-08 07:22 GMT

ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ సినిమాలో వరుణ్ తేజ్ మీద డామినేషన్ చూపించింది. ఆ సినిమాలో భానుమతిగా రెచ్చిపోయి నటించింది. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయిలో నాని పాత్రతో పోలిస్తే సాయి పల్లవి పాత్రకి నటనకు స్కోప్ లేకపోవడంతో… ఊరుకుంది కానీ లేదంటే నానితో పోటీపడి మరీ సాయి పల్లవి ఇరగదీసేది. ఇక పడి పడి లేచే మనసు సినిమాలో శర్వాతో పోటీగా నటించింది. ఏ సినిమాలో అయినా తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటున్న ఈ మలయాళీ భామ రెండు మూడు సినిమాలు రిజెక్ట్ చేసింది. తన పాత్రకి ప్రాధాన్యత లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ కి కూడా సాయి పల్లవి నో చెప్పిందనే టాక్ నడుస్తుంది.

ఒప్పుకోని సాయి పల్లవి

మహేష్ బాబు మహర్షి సినిమా తర్వాత ఎఫ్ 2 డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన 26 సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఉంది కదా… ఆ సినిమాలో మహేష్ కి జోడిగా సాయి పల్లవితో పాటు గీత గోవిందం హీరోయిన్ రష్మిక అయితే బాగుంటుందని అనిల్ రావిపూడి.. మహేష్ కి చెప్పగా… మహేష్ ఓకె చేసాక.. అనిల్ రావిపూడి సాయి పల్లవిని కలిసి కథ చెప్పాడు. కథ విన్న తర్వాత ఆ సినిమాలో న‌టించేందుకు ఆమె జంకినట్లుగా వార్తలొస్తున్నాయి. మహేష్ తో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో సాయి ప‌ల్ల‌వి సూపర్ స్టార్ ఆఫర్ కి నో చెప్పిన‌ట్టు స‌మాచారం. మరోపక్క రష్మిక, మహెష్ సరసన నటించేందుకు ఎగిరిగంతేసి ఒప్పేసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి సాయి పల్లవి తన పాత్రకి ప్రాధాన్యం లేకపోతే ఎవ్వరికైనా ఒకే మాట.

Tags:    

Similar News