సమంతపై ఆ వార్త నిజమేనా..?

మజిలీ సినిమాకు సంబంధించి సమంతపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే కెరీర్ లో దూసుకుపోతుంటే భర్త నాగచైతన్య మాత్రం [more]

Update: 2019-04-05 08:04 GMT

మజిలీ సినిమాకు సంబంధించి సమంతపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే కెరీర్ లో దూసుకుపోతుంటే భర్త నాగచైతన్య మాత్రం కాస్త డల్ పొజిషన్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు కలిసి రెండు మూడు సినిమాలు చేసిన ఈ జంట.. పెళ్లి తర్వాత భర్త చైతు కెరీర్ ని నిలబెట్టడానికే సమంత చైతుతో కలిసి మజిలీ సినిమా చేసింది. అయితే మజిలీ సినిమా విషయంలో సమంత.. చైతు లుక్స్, క్యారెక్టర్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టిందట.

ఇంకో హీరోయిన్ ను తొక్కేసిందట…

అంతవరకూ ఓకె.. కానీ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన దివ్యంవని సమంత కావాలనే ఫోకస్ కాకుండా తొక్కేసిందనే న్యూస్ ఉంది చూశారూ.. అది మాత్రం హాట్ హాట్ గా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. మజిలీ సినిమాకి తానే ఆయువుపట్టు, తాను లేనిదే సినిమా లేదు అన్నట్టుగా ఉన్న సమంత ప్రవర్తనకు మజిలీ మేకర్స్ కూడా కాస్త ఇబ్బంది పడ్డారట. ఇక దివ్యంశని తనకున్న క్రేజ్ తో తొక్కేసిందని, ఆమెని ఎక్కడా హైలెట్ కాకుండా సమంత ప్రయత్నించిందని.. అందుకే ఆ హీరోయిన్ తో మజిలీ టీం పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదట. మరి సమంత మీదొచ్చిన ఈ న్యూస్ లో ఎంతవరకు నిజముందనేది స్పష్టత లేదు.

Tags:    

Similar News