#RRR బ్యాక్ డ్రాప్ అదేనంట..!

Update: 2018-11-01 08:42 GMT

ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు కనీసం ఓపెనింగ్ కూడా జరగలేదు కానీ #RRR చిత్రంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది రాజమౌళి సినిమా కాబట్టి. ఇందులో రామ్ చరణ్ - ఎన్టీఆర్ నటిస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాకు కొబ్బరికాయ ఎప్పుడు కొడతారు..ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది ప్రేక్షకుల్లో. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. గత మూడునాలుగు నెలల నుండి హైదరాబాద్ శివార్లలో ఈ చిత్రానికి సంబంధించి భారీ ఎత్తున ఓ నిర్మాణం సాగుతోందట.

స్వాతంత్య్ర పోరాటంపైనా..?

దీన్ని రాజమౌళి దగ్గరుండి మరి చేసుకుంటున్నారట. బ్రిటిష్ కాలం నాటి ఒక పట్టణ ప్రాంతం తో పాటుగా.. ఒక గ్రామానికి సంబంధించిన కూడలి ఈ సెట్ లో భాగంగా నిర్మాణం చేస్తున్నారట. దీంతో ఈ సినిమా కథ స్వాతంత్ర్య పోరాటం జరిగిన కాలం నేపథ్యంలో ఉంటుందన్న వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అలానే చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఏంటో బయటికి వచ్చాయి. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా... ఎన్టీఆర్ ఓ దొంగగా నటిస్తున్నాడని సమాచారం. ప్రీ - ఇండిపెండెన్స్ పీరియడ్ ఫిలిం అంటే ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే అవకాశముంది. దీంతో రాజమౌళి మరోసారి 'బాహుబలి' రేంజ్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తాడని ఇప్పటినుండే అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Similar News