ఇంతమాత్రానికే రష్మిక బ్రేకప్ చేసుకుందా..?

Update: 2018-09-25 07:43 GMT

ఈ ఏడాది సూపర్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి 100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడమైతే.. మరో సెన్సేషన్ గీత గోవిందంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న తన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకోవడం. ఈ రెండు సూపర్ సెన్సేషనే. అయితే గీత గోవిందం హిట్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఉన్నట్టుండి తన లవర్ రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది. కారణాలు క్లారిటీ లేవుగానీ... రష్మిక ఎంగేజ్మెంట్ రద్దు అయ్యిందని ప్రకటించిన రష్మిక తల్లి మాత్రం... ఈ విషయంలో కొన్ని రోజులుగా బాధపడుతున్నట్టుగా చెప్పడం... అలాగే రష్మిక బ్రేకప్ చేసుకున్న హీరో రక్షిత్ ఈ విషయంలో రష్మిక తప్పేం లేదని లేఖ ఒకటి రాయడం జరిగాయి.

మేనేజర్ మాటలు విని...

ఇంత జరిగినా రష్మిక మందన్న తన ఎంగేజ్మెంట్ ని ఎందుకు బ్రేకప్ చేసుకుందో మాత్రం కరెక్ట్ కారణం తెలియలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక చెప్పుడు మాటలకు పడిపోయి.. తన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది కూడా రష్మిక తన మేనేజర్ చెప్పిన మాటలతోనే ఈ లవ్ ని బ్రేకప్ చేసుకుందట. కెరీర్ బాగున్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటే గ్లామర్ ఇండస్ర్టీలో కెరీర్ కంటిన్యూ కావడం కష్టమని రష్మిక మేనేజర్ చెప్పడం... అలాగే కన్నడ కన్నా తెలుగుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని కూడా చెప్పాడట. శాండిల్‌వుడ్‌ని ఎంత దూరంగా పెడితే.... టాలీవుడ్‌లో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయంటూ రష్మికకు ఆమె మేనేజర్ మాటలు చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌ లో గుసగుసలు వినబడుతున్నాయి. మేనేజర్ చెప్పిన మాటలకు పడిపోయిన రష్మిక వెనకాముందు చూడకుండా రక్షిత్ కి బ్రేకప్ చెప్పిందని అంటున్నారు.

Similar News