డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది [more]

Update: 2019-02-12 07:57 GMT

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఓ మెలిక పెట్టాడని టాక్. రామ్ చరణ్ 5 కోట్లు ఇస్తా అని మాట ఇచ్చాడు. అయితే ఆ 5 కోట్లు కాష్ రూపంలో ఇవ్వడట. రామ్ చరణ్ చేసే నెక్స్ట్ సినిమాకి ఇస్తాడట. హమ్మయ్య అనుకున్న టైంలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఆ రికవరీ ఇవ్వడట. తన తండ్రి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాతో డబ్బు రికవరీ చేసుకునే ఆప్షన్ ఇచ్చారని తెలుస్తోంది.

త‌న తండ్రి సినిమాతో…

అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుతం చిరు సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత వెంటనే కొరటాలతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అటు త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత వెంకీతో చేసే అవకాశం ఉందని టాక్. ఇలా చూస్తే వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వచ్చెను? అని డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడుతున్నారట. మరి దీనికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News