ఒకటి సాఫ్ట్.. మరొకటి మాస్... రెండింటిలో ఫైనల్ గా..!

Update: 2018-10-08 07:04 GMT

ఆగష్టు నుండి రామ్ చరణ్ - బోయపాటి సినిమా అప్ డేట్స్ కై మెగా ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు లో లేదా సెప్టెంబర్ లో రామ్ చరణ్ మూవీ టైటిల్ గానీ... ఫస్ట్ లుక్ గానీ విడుదలవుతుంది అనుకుంటే.. ఎక్కడా చడీ చప్పుడు లేదు. బోయపాటి దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న #RC12 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రామ్ చరణ్ కూడా గ్యాప్ లేకుండా బోయపాటి సినిమా షూటింగ్ లో పాల్గోంటున్నాడు. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తున్న బోయపాటి... రామ్ చరణ్ లుక్ ని, టైటిల్ ని దసరా సందర్భంగా వదిలే ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం.

ప్రచారంలో అనేక టైటిల్స్...

ఈలోపు ఈ సినిమా టైటిల్ అంటూ రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొదటగా చరణ్ #RC12 కి చిరు మూవీ 'స్టేట్ రౌడీ' అని పెడుతున్నారని టాక్ వినబడింది. చివరికి ఇప్పుడు చిరు, పవన్ ల కెరీర్ లో అద్భుతమైన హిట్స్ సాధించిన 'స్టేట్ రౌడీ', 'తమ్ముడు' టైటిల్స్ ని కలిపి.. 'రౌడీ తమ్ముడు' అనే మాస్ తరహాలో పెడుతున్నారని నిన్న మీడియాలో వినిపించిన న్యూస్. అయితే ఉదయం 'రౌడీ తమ్ముడు' అని.. సాయంత్రానికల్లా. చెర్రీ @RC12 కి 'విన‌య విధేయ రామ‌' అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్టుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

టైటిల్ సాఫ్ట్ అయినా...

మరి 'రౌడీ తమ్ముడు' అనే మాస్ టైటిల్ ని పెడతారా.. 'విన‌య విధేయ రామ‌' అనే సాఫ్ట్ టైటిల్ పెడతారా అనేది క్లారిటీ లేదు కానీ.. ఈ రెండు టైటిల్స్ ని #RC12 బృందం కావాలనే లీక్ చేసిందని.. దసరా కల్లా .. ఏ టైటిల్ ఫాన్స్, ప్రేక్షకుల నోట్లో నానుతుందో.. అదే టైటిల్ #RC12 కి పెడతారని అంటున్నారు. మరి 'రౌడీ తమ్ముడు' ఊర మాస్ టైటిల్ కాగా.. 'విన‌య విధేయ రామ‌' వెరీ సాఫ్ట్ టైటిల్. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ... బోయపాటి మాత్రం సినిమాని అస్సలు సాఫ్ట్ గా తెరకెక్కించాడు. ఆయన గత చిత్రం టైటిల్ 'జయ జానకి నాయక' ఎంత సాఫ్ట్ గా ఉన్నా.. సినిమాలో వయోలెన్స్ ఎలా ఉందో చూసాం. మరి #RC12 కి 'విన‌య విధేయ రామ‌' టైటిల్ పెట్టినప్పటికీ... సినిమాలో యాక్షన్ కి ఎలాంటి ఢోకా ఉండదట. మరి దసరా కల్లా ఫైనల్ గా ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో కానీ ప్రస్తుతం ఈ రెండు టైటిల్స్ మాత్రం ట్రెండింగ్ లోకొచ్చేశాయి.

Similar News