రకుల్ అస్సలు తగ్గడం లేదే..!

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వరుస డిజాస్టర్స్ రకుల్ ప్రీత్ అవకాశాలకు గండికొట్టడం ఒక ఎత్తు అయితే.. టాప్ హీరోయిన్ [more]

Update: 2019-03-26 07:15 GMT

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వరుస డిజాస్టర్స్ రకుల్ ప్రీత్ అవకాశాలకు గండికొట్టడం ఒక ఎత్తు అయితే.. టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు అందుకున్న పారితోషకాన్ని క్రేజ్ లేని టైంలోనూ డిమాండ్ చేస్తూ రావడంతో.. వచ్చిన అవకాశాలు కూడా రకుల్ చేజారాయన్నది టాక్. ఇక తమిళంలోనూ రకుల్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. కానీ బాలీవుడ్ లో మాత్రం రకుల్ కాస్త మెరుస్తుంది. అక్కడి అవార్డు ఫంక్షన్స్ లో, రాంప్ వాక్స్ లో రకుల్ వెలిగిపోతుంది. అక్కడ రెండు మూడు అవకాశాలు రకుల్ చేతిలో ఉన్నాయి.

క్రేజ్ ఉండటంతో ఆమెనే ఫైనల్

అయితే తాజాగా రకుల్ ప్రీత్ తెలుగులో సీనియర్ హీరో నాగార్జున సరసన మన్మధుడు 2 సినిమాలో నటిస్తుంది. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2ని మొదలు పెట్టారు. రాహుల్ చెప్పిన కథకు బాగా కనెక్ట్ అయిన నాగార్జునే స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా మొదట్లో నాగ్ సరసన రకుల్ ప్రీత్ ని ని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే రకుల్ రెండు కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో రకుల్ ని పక్కనపెట్టి ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజపుట్ ని తీసుకుందామనుకున్నారట. కానీ పాయల్ కన్నా ఎక్కువగా రకుల్ ప్రీత్ కి క్రేజ్ ఎక్కువ ఉండడంతో ఆమెకి రెండు కోట్లు ఇచ్చి మరీ సినిమాలో పెట్టుకుందామని దర్శకుడు రాహుల్ చెప్పడంతో నాగార్జున రకుల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడనేది తాజా సమాచారం.

Tags:    

Similar News