వరుణ్ మీద కోపంతో నిర్మాత

సాధారణ రోజుల్లో ఏమో కానీ పండగ సీజన్ లో సినిమా హిట్ అవ్వాలంటే చాలా కష్టం. పండగ సీజన్ లో పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమాత్రం [more]

Update: 2019-01-19 10:49 GMT

సాధారణ రోజుల్లో ఏమో కానీ పండగ సీజన్ లో సినిమా హిట్ అవ్వాలంటే చాలా కష్టం. పండగ సీజన్ లో పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమాత్రం టాక్ తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. కానీ వరుణ్ తేజ్ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ చిత్రంతో తనకు ఎదురులేదని నిరూపించాడు. అనిల్ రావిపూడి “ఎఫ్ 2” సినిమాతో వరుణ్ తేజ్ లో కామెడీ యాంగిల్ ని పరిచయం చేసాడు. ఈ సినిమా తరువాత వరుణ్ కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ ప్రొడ్యూసర్ గా పరిచయం కానున్నాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనున్న ఈ సినిమా స్టార్ట్ అవ్వడం ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కి ఇష్టం లేదు.

తన సినిమా పక్కన పెట్టడంతో…

ఎందుకంటే అనిల్ సుంకర ప్రొడ్యూసర్ గా “అప్పట్లో ఒకడుండే వాడు” ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో వరుణ్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది అనుకుంటే మధ్యలో మరో సినిమాని తీసుకొచ్చాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఇలా చేయడం అనిల్ కు నచ్చకపోవడంతో కోపంగా ఉన్నాడని సమాచారం. మరి అనిల్ సుంకరని కూల్ చెయ్యడానికి వరుణ్ తేజ్…. సుంకర ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తాడో లేదో చూడాలి.

Tags:    

Similar News