ప్రభాస్ కి ఫ్రెంచ్ టైటిల్!

Update: 2018-10-08 09:53 GMT

జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పట్టాలెక్కింది. హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందనేది తెలిసిన విషయమే. ఇక ఇటలీ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు పూజ హెగ్డే కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్ ని పక్కన పెట్టి ప్రభాస్ ఈ సినిమాని మొదలు పెట్టాడు.

వెరైటీ టైటిల్ పెడుతున్నారా..?

'సాహో' కూడా మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ప్రబాస్ - రాధాకృష్ణ మూవీ ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం మలయాళ మూవీకి ఫ్రీమేక్ అనే న్యూస్ ప్రచారంలో ఉంది. 1990లో వచ్చిన ఆ సినిమాకి ఈ సినిమా ఫ్రీమేక్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ఒక టైటిల్ అనుకుంటున్నట్లుగా ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు కాస్త వెరైటీగా ‘అమూర్‌’ అనే టైటిల్‌ ను పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ప్రేమ అనే అర్థంతో...

‘అమూర్‌’ అనేది ఫ్రెంచ్ పదం. ‘అమూర్‌’ పదానికి ఫ్రెంచ్‌ లో 'ప్రేమ' అని మీనింగ్ వస్తోంది. అందుకే ప్రభాస్ 20వ చిత్రానికి ఆ టైటిల్ నే సెట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'సాహో' షూటింగ్ తో పాటు ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ ని కూడా పరుగెత్తిస్తున్నాడని.. ఇక 'సాహో', ప్రభాస్ 20వ చిత్రం కూడా 2019 చివరినాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని చెబుతున్నారు.

Similar News