పవన్ కథ వెంకటేష్ చేస్తున్నాడా ..?

Update: 2018-09-15 06:26 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు వెళ్లనుంది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ ఈ నెల 20న డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల అవ్వుతున్నట్టు మేకర్స్ తెలిపారు.

పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లడంతో...

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను వెంకటేశ్ తో చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పుటి నుండే అంచనాలు పెరిగాయి ప్రేక్షకుల్లో. కొంతకాలం క్రితం వెంకటేష్ కి త్రివిక్రమ్ ఓ కథ వినిపించగా అది వెంకీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కథ పవన్ కోసం అనుకుంది అంట. పవన్ కు ఆ కథ బాగా నచ్చి ఓకే కూడా చెప్పాడట. అయితే పవన్ సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్లడంతో త్రివిక్రమ్ అదే కథను వెంకటేశ్ తో చేయనున్నాడనేది టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వీరి కాంబినేషన్ లో సినిమా అయితే పక్కా అని తెలుస్తుంది.

Similar News