పడి పడి లేచే మనసు కథ ఇదేనా?

Update: 2018-10-24 06:50 GMT

హను రాఘవపూడి నితిన్ హీరోగా... అర్జున్ విలన్ గా 'లై' సినిమాని తెరకెక్కించగా... ఆ సినిమా మరీ ఇంటిలిజెంట్ గా ఉండడంతో ఎవ్వరికి ఒక పట్టాన అర్ధం కాక ప్రేక్షకులంతా కలిసి డిజాస్టర్ చేశారు. అయితే ఆ సినిమా తర్వాత చాన్నాళ్లకి హను రాఘవపూడి 'మహానుభావుడు' హిట్ తో ఉన్న శర్వానంద్ తో కలిసి 'పడి పడి లేచే మనసు' అంటూ ఒక ప్రేమ కథను తెరకెక్కించాడు. మధ్యలో శర్వానంద్, సాయి పల్లవి మీద రకరకాల వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినప్పటికీ.. అనుకున్న టైంకే దర్శకుడు సినిమాని పూర్తి చేశాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చెయ్యడం మిగిలి ఉంది. ఇక పడి పడి లేచే మనసు సినిమా డిసెంబర్ 21న విడుదల డేట్ ప్రకటించారు మేకర్స్. అప్పటికల్లా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్స్ ని పక్కాగా పూర్తి చేసి సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్...

అయితే ఈ సినిమాలో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్ సాయిపల్లవి డాక్టర్ గా నటించింది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా ఒక కాలనీలో సాగే ప్రేమ కథ కావొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రేమకథ వెనుక ఒక బలమైన నేపథ్యం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇక పడి పడి లేచే మనసు కథ మొత్తం ఆమధ్య నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం నేపథ్యంలోనే రూపుదిద్దుకున్నట్టుగా తెలుస్తోంది. మరి వినటానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ సినిమా కథని హను రాఘవపూడి తనదైన స్టయిల్లో ఎలా తెరకెక్కించాడో అనేది డిసెంబర్ 21 వరకు ఆగితే తేలిపోతుంది.

Similar News