నిత్యా మీనన్ ను బ్యాన్ చేస్తున్నారా..?

గ్లామర్ లేకపోయినా అందం, నటనతోనే ప్రేక్షకులను మెప్పించే అతి కొద్ది మంది నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. లిప్ కిస్సెస్ కి గ్లామర్ షోకి నో చెప్పే [more]

Update: 2019-04-30 09:13 GMT

గ్లామర్ లేకపోయినా అందం, నటనతోనే ప్రేక్షకులను మెప్పించే అతి కొద్ది మంది నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. లిప్ కిస్సెస్ కి గ్లామర్ షోకి నో చెప్పే నిత్యా మీనన్ కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాలతోనే తన టాలెంట్ ని నిరూపించుకుంటుంది. తెలుగులో ఓ అన్నంత ఆఫర్స్ లేకపోయినా.. మలయాళంలో నిత్యా మాత్రం బిజీ. తాజాగా టాలీవుడ్ లో రాజమౌళి తెరకేక్కిన్చాబోయే #RRR కోసం నిత్యా మీనన్ పేరుని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని.. దాదాపుగా ఎన్టీఆర్ కి సెకండ్ హీరోయిన్ గా నిత్యా ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి. #RRR లో ఎన్టీఆర్ ని ఆరాధించే పాత్రలో నిత్య నటించబోతుందనే న్యూస్ ప్రచారంలో ఉన్న వేళ నిత్యా మీనన్ పై ఇప్పుడొక న్యూస్ షాకిస్తుంది. అదేమిటంటే మలయాళ దర్శక నిర్మాతలు నిత్యా మీనన్ ని బ్యాన్ చెయ్యాలని చూస్తున్నారట. ఎప్పటినుండో నిత్యా మీనన్ మీద దర్శకులను గౌరవించదని, సినిమా మేకింగ్ విషయంలో నిత్యా కలగజేసుకుంటుందనే న్యూస్ ఉంది.

తల్లి ఆరోగ్యం బాగోలేనందునే

తాజాగా నిత్యా మీనన్ ని తమ సినిమాల్లో బుక్ చేసుకోవడానికి ఆమె ఇంటికి వెళితే నిత్యా మాత్రం ఆ దర్శకులను కలవకుండా ఇబ్బంది పెడుతుందట. ఇలాంటివి కోకొల్లలుగా జరిగేసరికి దర్శకనిర్మాతలకు విసుగొచ్చి ఆమెని బ్యాన్ చెయ్యాలని నిర్మాతల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయమై నిత్యా స్పందిస్తూ.. తన తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాని.. అలాంటి సమయంలో తానూ షూటింగ్స్ కి హాజరవుతున్నానని.. కానీ నిర్మాతలు తనతో అలాంటి సమయంలో మట్లాడాడానికి వస్తే.. తాను ఏడుస్తూ మాట్లాడాల్సి వస్తుందని వాళ్లని అవాయిడ్ చేసానని.. తనని మలయాళ ఇండస్ట్రీ నుండి పంపించడానికి కొందరు కుట్ర చేస్తున్నారని నిత్యా మీనన్ ప్రధాన ఆరోపణ. తల్లికి బాగోలేక మానసిక సంఘర్షణకు లోనవుతున్న టైంలో సినిమాల్లో నటించడంపై ఆసక్తి లేదని అందుకే వాళ్లతో మాట్లాడలేకపోయాని చెబుతుంది నిత్యా.

Tags:    

Similar News