నితిన్ కి హ్యాండిచ్చి రానాని పట్టాడు..!

Update: 2018-12-13 06:50 GMT

కెరీర్ పరంగా ఆయనకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవచ్చు కానీ ఆయన తీసిన ప్రతి సినిమా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులని కట్టిపడేసాలా చేస్తుంది. డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఏలేటి “మనమంతా” సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా లైన్ లో పెట్టలేదు. ప్రతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకునే ఏలేటి ఆ మధ్య సాయి ధరమ్ తేజ్, నితిన్ లతో ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ చివరికి నితిన్ తోనే సినిమా చేయాలనుకున్నాడు.

నితిన్ తో ఓకే అనుకున్నాక...

అతను ముందు వెంకటేష్ తో చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్క్ అవ్వలేదు. నితిన్ కి ఓ లవ్ స్టోరీ చెప్పాడట. అది నితిన్ నచ్చడంతో వెంటనే స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. అయితే నితిన్ 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుములతో ఫిక్స్ అయినప్పటికీ... ఏలేటి కథ నచ్చడంతో రెండు సినిమాలు ఒకేసారి చేద్దామనుకున్నాడు. అంతా ఓకే అనుకున్న టైంలో ఏలేటి నితిన్ ని కాదని రానాతో ఈ ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయట. మరి ఏలేటి ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటో తెలియలేదు. అందుకే నితిన్ త్వరలోనే వెంకీ కుడుముల ప్రొజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

Similar News