ఆ అదృష్టం బోయపాటికి దక్కిందా?

ఎప్పటినుండో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై వార్తలొస్తున్నాయి. 2018 లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హింట్ ఇచ్చినా.. మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. ఎప్పుడెప్పుడు [more]

Update: 2019-10-31 07:06 GMT

ఎప్పటినుండో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై వార్తలొస్తున్నాయి. 2018 లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హింట్ ఇచ్చినా.. మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అది కూడా బోయపాటి – బాలయ్య సినిమా ద్వారా అని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య.. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్నాడు.

రూలర్ ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసి.. తర్వాత జనవరి నెలాఖరు నుండి బాలకృష్ణ బోయపాటి సినిమాని మొదలెట్టబోతున్నాడు. ఓన్ బ్యానేర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ కేరెక్టర్ ని బాగా పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నాడట బోయపాటి. వినయ విధేయరామ తర్వాత బోయపాటి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. తాజాగా బాలయ్య సినిమాతో వార్తల్లకొచ్చిన బోయపాటి.. ఇప్పుడు బాలకృష్ణ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా వున్నాడు. మరి మోక్షజ్ఞ బోయపాటి సినిమా తో సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు కానీ.. నందమూరి అభిమానులు మాత్రం మోక్షుజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడనే న్యూస్ తో సంబరాలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News