బాలయ్యతో కయ్యానికి కాలుదువ్వుతున్న రోజా?

బాలకృష్ణ – రోజా లు కలిసి చాలా సినిమాల్లో నటించి హిట్ పెయిర్ గా పేరొందినా.. ప్రస్తుతం రోజా – బాలకృష్ణలు రాజకీయ ప్రత్యర్ధులు. వైసిపి నుండి [more]

Update: 2019-11-27 06:52 GMT

బాలకృష్ణ – రోజా లు కలిసి చాలా సినిమాల్లో నటించి హిట్ పెయిర్ గా పేరొందినా.. ప్రస్తుతం రోజా – బాలకృష్ణలు రాజకీయ ప్రత్యర్ధులు. వైసిపి నుండి రోజా, టిడిపి నుండి బాలయ్య కయ్యానికి ఎప్పుడూ కాలుదువ్వుతారు. ఇక బాలయ్య హీరోగా, రోజా మాత్రం జబర్దస్త్ కి జేడ్జ్ గా, బతుకు జట్కాబండి కి యాంకర్ గా పనిచేస్తూ బుల్లితెర మీద బిజీగా ఉంటూ ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తూ వెండితెరకు కాస్త దూరం గానే ఉంటుంది. తాజాగా బాలకృష్ణ సినిమాలో రోజా పవర్ ఫుల్ విలన్ పాత్ర వెయ్యబోతున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో త్వరలో మొదలు కాబోతున్న సినిమా లో లేడి విలన్ పాత్ర కోసం రోజని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది.

బాలయ్య సినిమాలో రోజా విలనిజం పండిస్తే ఆ సినిమాకి భారీ క్రేజ్ వస్తుందని దర్శకుడు బోయపాటి భావిస్తున్నాడట. ఎలాగూ తాను బాలయ్య కోసం ప్రిపేర్ చేసిన కథలో ఓ పవర్ ఫుల్ లేడి విలన్ పాత్ర ఉండడంతో.. ఆపాత్ర ని రోజా తో చేపిస్తే… బాలయ్య సినిమాకి మరింత క్రేజ్ యాడ్ అవుతుంది అని బోయపాటి ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం రూలర్ సినిమాతో బిజీగా వున్న బాలకృష్ణ ఆ సినిమా విడుదల కాగానే బోయపాటి సినిమా కోసం తయారవుతాడని, ఈలోపు బోయపాటి నటీనటుల ఎంపికతో పాటుగా పూర్తి స్క్రిప్ట్ ని లాక్ చేసి బాలయ్య కోసం రెడీగా ఉంటాడని తెలుస్తుంది.మరి రోజా ఒప్పుకుంటే.. బయట రాజకీయ ప్రత్యర్థులైన రోజా, బాలయ్య లు స్క్రీన్ మీద ఎలా ఢీ కొడతారో చూడాలి

Tags:    

Similar News