నాగబాబు కాంప్రమైజ్ నిజమేనా?

నాగబాబు ఇప్పుడు రెండికి చెడ్డ రేవడిలా గిల గిల తన్నుకుంటున్నాడు. ఎందుకంటే జబర్దస్త్ మీద అదిరే పంచ్ లు వేసి జబర్దస్త్ నుండి పక్క ఛానల్ కి [more]

Update: 2020-01-31 05:10 GMT

నాగబాబు ఇప్పుడు రెండికి చెడ్డ రేవడిలా గిల గిల తన్నుకుంటున్నాడు. ఎందుకంటే జబర్దస్త్ మీద అదిరే పంచ్ లు వేసి జబర్దస్త్ నుండి పక్క ఛానల్ కి పోయి.. అదిరింది అంటూ మరో ప్రోగ్రాం కి జేడ్జ్ గా వెళ్ళాడు. మరి అదిరింది షో మొదటినుండి అదిరింది అనే రేంజ్ పంచ్ నాగబాబు కి ఇస్తూనే ఉంది. వారం వారం అదిరింది రేటింగ్ పెరుగుతుంది అనుకుంటే.. అంతకంతకు దిగజారుతోంది కానీ.. అదిరింది క్రేజ్ మాత్రం పెరగడం లేదు. నాగబాబు ఎంతగా మొత్తుకుని జబర్దస్త్ ని బ్యాడ్ చేస్తున్నప్పటికీ అదిరిందికి హైప్ రావడం లేదు. ఇక నాగబాబు కూడా అదిరింది ని నమ్ముకుంటే ఉన్న క్రేజ్ కూడా పోతుంది అనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

ఇప్పటికే జీ తెలుగు నుండి నాగబాబు కి ప్రెజర్ స్టార్ట్ అయ్యింది అని… దీనితో నాగబాబు పునరాలోచనలో పడినట్లుగా సమాచారం. నైతిక బాధ్యత వహిస్తూ నాగబాబు అదిరింది షో నుండి తప్పుకుంటాడేమో అనే ప్రచారం జరుగుతుంది. ఇక నాగబాబు మల్లి జబర్డస్ట్ కి ఎంట్రీ కూడా ఇవ్వొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే గెటప్ శీను నాగబాబు గారు ప్లేస్ లో ఎవరిని ఊహించుకోలేకపోతున్నామని.. మల్లి ఆయన వస్తే మాకు సంతోషంగా ఉంటుంది అనే మాటతో నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ ఖాయమనే మాట గట్టిగా వినబడుతుంది. మరోపక్క నాగబాబు బిజెపి తో జనసేన కలవడం పార్టీకి మంచి చేకూరుతుంది అనడమే కాదు.. 2024 లో అధికారం మాదే అంటూ తొడలు కొడుతున్నాడు.

Tags:    

Similar News