వంశీకి హ్యాండ్ ఇచ్చింది పక్కానే!!

మహేష్ బాబు అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసిన తర్వాత మహర్షి డైరెక్టర్ వంశి పైడిపల్లితో మరో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే వంశి [more]

Update: 2020-08-29 08:35 GMT

మహేష్ బాబు అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసిన తర్వాత మహర్షి డైరెక్టర్ వంశి పైడిపల్లితో మరో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే వంశి పైడిపల్లి కథ నచ్చకో.. లేదంటే ఏం జరిగిందో తెలియదు కానీ… వంశి పైడిపల్లి సినిమాకి నో చెప్పి పరశురామ్ తో సర్కారు వారి పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే మహేష్ బాబు ఏ డైరెక్టర్ మెయింటింగ్ చెయ్యని క్లోజ్ నెస్ వంశి తో ఆయన ఫ్యామిలీతో చేసాడు. వంశి పైడిపల్లి – మహేష్ ఫామిలీస్ రెండు కలిసిమెలిసి ఉండేవారు. అయితే మహేష్ తో సినిమా ఆగిపోయాక కూడా వంశి మహేష్ ఫ్యామిలీతోనే ఉన్నాడు.

మహేష్ సర్కారు వారి పాట తర్వాత వంశి తో సినిమా చేస్తాడనే టాక్ ఉంది. కానీ మహేష్ వరస చూస్తుంటే వంశీతో ఇప్పుడప్పుడే సినిమా ఆలోచన లేనట్లుగా కనబడుతుంది. మహేష్ సర్కారు వారి పాట తర్వాత అధికారికంగా రాజమౌళితో సినిమా చెయ్యాల్సి ఉంది. ఒకవేళ అది జరగక కాస్త లేట్ అయినా.. మహేష్ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేసినా చెయ్యొచ్చు అనే ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సర్కారు వారి పాట – రాజమౌళి సినిమా గ్యాప్ లో అనిల్ తో సినిమా చుట్టేసినా చుట్టెయ్యొచ్చు అని అంటున్నారు. మరి తర్వాత త్రివిక్రమ్, కొరటాల అంటాడు కానీ.. మహేష్ వంశి పేరు ఎత్తేలా కనిపించడం లేదు. ఫైనల్ గా, మహేష్ వంశీకి హ్యాండ్ ఇవ్వడం పక్కా అన్నమాట. 

Tags:    

Similar News