పారితోషకాలు 60 కోట్లు.. సినిమా బడ్జెట్ 20 కోట్లేనట!

మహేష్ మహర్హి సినిమా గత గురువారం విడుదలైంది. ఆ సినిమా ముచ్చట ముగిసేలోపు మహేష్ తన 26వ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మొదలు [more]

Update: 2019-05-13 05:40 GMT

మహేష్ మహర్హి సినిమా గత గురువారం విడుదలైంది. ఆ సినిమా ముచ్చట ముగిసేలోపు మహేష్ తన 26వ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మొదలు పెట్టబోతున్నాడు. అనిల్ రావిపూడి – మహేష్ బాబుల చిత్రం జూన్ రెండో వారం తరువాత మొదలు కాబోతుందనేది సమాచారం. మహర్షి సినిమా హిట్, సక్సెస్ సెలెబ్రేషన్స్ తర్వాత ఓ పది రోజులు కుటుంబంతో ఉల్లాసంగా విదేశీ ట్రిప్ వేసి మళ్లీ స్వదేశానికి వచ్చాక మహేష్ అనిల్ తో సినిమా మొదలెడతాడట. కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం మహేష్ అక్షరాలా 50 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడు అంటున్నారు.

బ‌డ్జెట్ 20 కోట్లేనా..?

అయితే ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సుప్రీం, పటాస్, రాజా ధి గ్రేట్.. ఆఖరుకి ఎఫ్ 2కి కూడా సాదాసీదా పారితోషకం అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ సినిమాకి అక్షరాలా 10 కోట్లు అందుకోబోతున్నాడంటున్నారు. ఇక మహేష్, అనిల్ పారితోషకాలు 60 కోట్లయితే.. సినిమాకి కేవలం 20 కోట్లలోపే బడ్జెట్ తో ముగించేయ్యాలని నిర్మాతల ప్లాన్ అట. అనిల్ రావిపూడి చెప్పిన కథకి ఓ అన్నంత బడ్జెట్ పెట్టక్కర్లేదని… మహేష్ రేంజ్ ఎంత ఉన్నప్పటికీ.. అనిల్ చెప్పిన కథకి 20 కోట్ల బడ్జెట్ సరిపోతుడున్నాడనేది లేటెస్ట్ న్యూస్. మరి ఈ సినిమాకి మొదట్లో దిల్ రాజు నిర్మాత అన్నప్పటికీ.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు తప్పుకున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మరి అనిల్ – మహేష్ కాంబో మూవీ 80 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది. ఎలాగూ మహేష్ సినిమాలకు 100 కోట్ల బిజినెస్ ఖాయమనేది భరత్ అనే నేను, మహర్షి విషయంలో తేలిపోవడంతో… మహేష్ సినిమాకి అలా భారీ పారితోషకాలు అంటున్నారు.

Tags:    

Similar News