కాజల్ పై అలిగిన బెల్లంకొండ..?

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ [more]

Update: 2019-05-21 07:47 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో బెల్లంకొండ హీరోగా, సోను సూద్ విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా క్లిన్ యూ సర్టిఫికెట్ తో బరిలోకి దిగుతుంది. ఇక గత శుక్రవారం విడుదలైన అల్లు శిరీష్ ఏబీసీడీకి వచ్చిన ఫ్లాప్ టాక్ తో సీత సినిమా మీద ప్రేక్షకులు భారీగా అంచనాలే పెట్టుకున్నారు. ఇక సీత సినిమా ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ యమా బిజీగా ఉంది. మొదటి నుండి కాజల్ అగర్వాల్ వలనే సినిమాకి భారీ హైప్ వచ్చింది. కాజల్ ని చూసే సినిమాకి భారీ బిజినెస్ జరిగింది కూడా. అయితే మొదటి నుండి సీత సినిమా విషయంలో కాజల్ అగర్వాల్ హైలెట్ అవడం, కాజల్ తన క్రేజ్ తోనే సినిమా ఆడేస్తుందని.. ప్రమోషన్స్ లో హల్చల్ చెయ్యడంతో బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ మీద కినుకు వహించాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

తేజ కూడా కాజల్ నే పొగుడుతుంటే

ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ ప్రింట్ మీడియాకి, వెబ్ మీడియాకి, ఛానల్స్ కి సోలో ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కేవలం నిన్న జరిగిన సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హడావిడి చేసాడు. ఇక కాజల్ క్రేజ్ ముందు శ్రీనివాస్ తక్కువే. తేజ కూడా మొన్నామధ్యన సీత సినిమా కథ కాజల్ కోసమే రాసానని.. కాజల్ మెయిన్ లీడ్ అంటే చాలామంది హీరోస్ సీత సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదని.. ఫైనల్ గా బెల్లంకొండను ఓకె చేసాడని చెప్పాడు. ఇక తేజ, కాజల్ ని పొగిడినట్లుగా బెల్లంకొండని ఎక్కడా పొగడలేదు. గతంలోనే తేజకి, బెల్లంకొండ శ్రీనివాస్ కి ఏవో విభేదాలనే ప్రచారం జరిగింది.

Tags:    

Similar News