నాగబాబు మీద అభిమానం లేదు.. ఏమి లేదు

జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్స్ కి, చమ్మక్ చంద్ర స్కిట్స్ కి ఎక్కువ రేటింగ్స్ వస్తుంటాయి. ప్రేక్షకులు కూడా చమ్మక్ చంద్ర స్కిట్స్ కి, హైపర్ [more]

Update: 2020-01-09 06:25 GMT

జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్స్ కి, చమ్మక్ చంద్ర స్కిట్స్ కి ఎక్కువ రేటింగ్స్ వస్తుంటాయి. ప్రేక్షకులు కూడా చమ్మక్ చంద్ర స్కిట్స్ కి, హైపర్ ఆది స్కిట్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇప్పుడు చమ్మక్ చంద్ర మల్లెమాల ని, జబర్దస్త్ ని వదిలి అదిరింది షో కి పక్క ఛానల్ అయిన జీ తెలుగుకీ వెళ్ళిపోయాడు. నాగబాబు జడ్జ్ గా జబర్దస్త్ నుండి అదిరిందికి మారడంతో నాగబాబు మీద అభిమానంతో తనకెంతో పేరు తెచ్చిన జబర్దస్త్ ని వదిలేసి చమ్మక్ చంద్ర అదిరింది షో కి జంప్ అయ్యాడు. అక్కడ స్కిట్స్ చేస్తూ హైలెట్ అవుతున్నాడు.

అయితే నాగబాబు మీద అభిమానం కన్నా ఎక్కువగా జబర్దస్త్ షో నుండి అదిరింది షో కి రావడానికి చంద్ర కి పారితోషకం కారణమనే టాక్ వినబడుతుంది. జబర్డస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చంద్ర ని లాగడానికి అదిరింది షో వారు అతనికి పారితోషకం ఎర వేశారని.. కాబట్టే చంద్ర అదిరిందికి జంప్ అయ్యాడని అంటున్నారు. చంద్ర కి జబర్దస్త్ కామెడీ షోలో కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలాంటి నాలుగు కాల్షీట్స్ నెలకు ఉండేవని తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు అదిరింది షో కి ఒక్క కాల్షీట్ కి చంద్ర కి 5 లక్షలు ముడుతున్నాయని.. అంటే అదిరింది వారు జబర్దస్త్ కన్నా డబుల్ ఇవ్వడంతోనే చంద్ర అదిరింది..ప్రోగ్రాం కి జంప్ అయ్యాడని అంటున్నారు. చంద్ర కి హైయెస్ట్ పారితోషకం తర్వాత కిర్రాక్ ఆర్పీకి.. ఆతర్వాతే ధనరాజ్, వేణుల పారితోషకాలు అదిరింది ప్రోగ్రాంలో ఉన్నట్లుగా తెలుస్తుంది

Tags:    

Similar News